యాప్నగరం

‘రాధ’ సాంగ్ టీజర్: మాస్ మసాలా దట్టించారే!

టాలీవుడ్‌లో భిన్నమైన కథలు ఎంచుకుంటూ.. వరుస సినిమాలతో దూసుకెళ్తున్న శర్వానంద్ మరో సరికొత్త చిత్రం ‘రాధ’తో ఈనెల 12న (రేపు) ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

TNN 11 May 2017, 5:15 pm
టాలీవుడ్‌లో భిన్నమైన కథలు ఎంచుకుంటూ.. వరుస సినిమాలతో దూసుకెళ్తున్న శర్వానంద్ మరో సరికొత్త చిత్రం ‘రాధ’తో ఈనెల 12న (రేపు) ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈసందర్భంగా ఈ చిత్రంలోని ‘ఓయ్ మేరా క్రిష్’ అనే మాస్ మసాలా సాంగ్‌ టీజర్‌ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.
Samayam Telugu radha movie oye mera krishu song released
‘రాధ’ సాంగ్ టీజర్: మాస్ మసాలా దట్టించారే!


శతమానం భవతి చిత్రంతో మంచి హిట్ కొట్టిన శర్వానంద్ ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నాడు. డెబ్యూ డైరెక్టర్ చంద్రమోహన్ దర్శకత్వంలో రాధ అనే ప్రాజెక్ట్ చేసాడు శర్వానంద్. కామెడీ మరియు రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో సరదా పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు శర్వా. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శర్వానంద్ సరసన భలే భలే మగాడివోయ్ బ్యూటీ లావణ్య త్రిపాఠి కథానాయికగా నటిస్తున్నది. రీసెంట్‌గా సెన్సార్ జరుపుకున్న ఈ చిత్రం రేపు(మే 12న) థియేటర్స్‌లో గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు. రాధా మూవీ టీజర్ , ట్రైలర్ , సాంగ్స్‌కు రెస్పాన్స్ అదిరిపోవడంతో ఈ సినిమాతో మరో హిట్ కొట్టేందుకు శర్వానంద్ రెడీగా ఉన్నాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.