యాప్నగరం

హిజ్రాకోసం లారెన్స్ ఏంచేశాడో తెల్సా!

రాఘవ లారెన్స్ డాన్స్ మాస్టర్ స్థాయి నుండి దర్శకుడిగా, హీరోగా ఎదిగాడు. తను ఏ స్థాయి నుండి వచ్చాడనే విషయాన్ని లారెన్స్ ప్రతి సందర్భంలో గుర్తుచేస్తూనే ఉన్నారు.

TNN 12 Apr 2017, 8:01 pm
రాఘవ లారెన్స్ డాన్స్ మాస్టర్ స్థాయి నుండి దర్శకుడిగా, హీరోగా ఎదిగాడు. తను ఏ స్థాయి నుండి వచ్చాడనే విషయాన్ని లారెన్స్ ప్రతి సందర్భంలో గుర్తుచేస్తూనే ఉన్నారు. తను కష్టపడి సంపాదించిన మొత్తంలో చాలా వరకు సేవా కార్యక్రమాలకు వినియోగించడం లారెన్స్ కూడా అలవాటు.
Samayam Telugu raghava lawrence helps transgenders
హిజ్రాకోసం లారెన్స్ ఏంచేశాడో తెల్సా!


వివిధ రకాల జబ్బులతో బాధ పడుతున్న వంద మందికి పైగా పిల్లలకు ఆపరేషన్స్ చేయించాడు. అంతేకాదు సమాజం చిన్న చూపు చూసే హిజ్రాలకు తనవంతు సహాయం చేస్తుంటాడు. ఆయన రూపొందించిన సినిమాలో కూడా వారి ప్రస్తావన తీసుకొచ్చారు. నిజజీవితంలో కూడా ఆయనకు హిజ్రాలంటే చాలా ఇష్టమని.. తన టీంలో వారు ఉన్నారని, వారికి సెంటిమెంట్‌గా భావిస్తానని అన్నారు.

లారెన్స్ సినిమా విడుదలవుతుంటే వెంటనే ఎంతోకొంత డబ్బును హిజ్రాల కోసం ఓపెన్ చేసిన అకౌంట్‌లో వేస్తాడట. అది ఆయనకొక సెంటిమెంట్‌గా మారిందని చెప్పారు. ఇంకో విషయమేమిటంటే హిజ్రాలు కూడా తమ కోసం ఏర్పాటు చేసుకున్న సంఘంలో లారెన్స్ పేరును బ్రాండ్ అంబాసిడర్‌గా పెట్టుకున్నారట.

మొత్తానికి సమాజం చిన్నచూపు చూస్తోన్న హిజ్రాలకు సహాయం చేస్తూ తన టీంలో సైతం చేర్చుకున్న లారెన్స్ మంచితనం అభినందనీయం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.