యాప్నగరం

అతనితో ‘హెబ్బా’ మూడోసారి

టాలీవుడ్‌లో ‘కుమారి 21F’సినిమాతో జతకట్టి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన యంగ్ కాంబినేషన్ రాజ్ తరుణ్, హెబ్బాపటేల్‌లు ‘ఆడోరకం ఈడోరకం’ సినిమాలో మరోసారి జోడీకట్టారు. తాజాగా..

TNN 3 Dec 2016, 4:50 pm
టాలీవుడ్‌లో ‘కుమారి 21F’సినిమాతో జతకట్టి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన యంగ్ కాంబినేషన్ రాజ్ తరుణ్, హెబ్బాపటేల్‌లు ‘ఆడోరకం ఈడోరకం’ సినిమాలో మరోసారి జోడీకట్టారు. ప్రస్తుతం ఈ జంట ముచ్చటగా మూడోసారి రొమాన్స్ చేయడానికి రెడీ అయ్యారు. ఇప్పటికే రెండు సక్సెస్‌లు అందుకున్న ఈ జోడి మరో సక్సెస్‌కి రెడీ అవుతున్నారు. .
Samayam Telugu raj tarun wants to romance with heba patel once again
అతనితో ‘హెబ్బా’ మూడోసారి


రాజ్ తరుణ్, హేబ్బా పటేల్ సక్సెస్ ఫుల్ జోడీ అనే విషయం ఇప్పటికే రెండు సార్లు ప్రూవ్ అయింది. దీంతో ఈ జోడీకి టాలీవుడ్‌లో మంచి క్రేజ్ వచ్చేసింది. ఈ హిట్ పెయిర్ మళ్లీ సినిమా చేసేందుకు దర్శకనిర్మాతలు ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నాడు. తాజాగా ఈ యంగ్ కాంబినేషన్ ‘అందగాడు’ మూవీలో నటిస్తున్నారు.

రైటర్‌నుండి డైరెక్టర్‌గా ప్రమోషన్ పొందిన వెలిగొండ శ్రీనివాస్ ఈ చిత్రానికి తొలిసారిగా దర్శకత్వం వహిస్తున్నాడు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో అందగాడు షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఎమోషనల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టెయిన్మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మిస్తున్నాడు. అందగాడు సినిమాను సమ్మర్ లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.