మాస్ మహారాజ రవితేజ లేటెస్ట్ మూవీ రాజా ది గ్రేట్ పాజిటివ్ టాక్‌తో పర్వాలేదనిపించుకుంటున్న తరుణంలో ఓ ఎదురు దెబ్బ తగిలినట్టు సమాచారం. రాజా ది గ్రేట్ సినిమా ఫేస్‌బుక్‌తోపాటు పలు పైరసీ సినిమాల వెబ్సైట్లలో ప్రత్యక్షమైందట. తరచుగా కొత్త సినిమాలని పైరసీ చేసే వెబ్సైట్లలో తమ సినిమా కూడా వుందని తెలుసుకున్న రాజా ది గ్రేట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి... రాజా ది గ్రేట్ సినిమా పైరసీనీ ప్రోత్సహించకుండా నేరుగా థియేటర్లలోనే చూసి సినిమాను ఎంజాయ్ చేయాల్సిందిగా ఆడియెన్స్‌కి విన్నవించుకున్నాడు.
బుధవారం రిలీజైన ఈ సినిమాకు ఈసారి దీపావళి పండగ కారణంగా కలిసొచ్చిన లాంగ్ వీకెండ్ ఓ ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం వుంది. ట్రేడ్ వర్గాలు చెబుతున్న ప్రకారం రిలీజైన తొలి రెండు రోజుల్లో ఈ సినిమా రూ. 10 కోట్ల వరకు సాధించినట్టు సమాచారం. పటాస్, సుప్రీం చిత్రాల ఫేమ్ అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో రవితేజ, మెహ్రీన్ ఫిర్జాదా జంటగా నటించగా రాధిక, రాజేంద్ర ప్రసాద్, ప్రకాష్ రాజ్, సంపత్ వంటి నటీనటులు ఇతర కీలక పాత్రలు పోషించారు.