యాప్నగరం

విడుదలకి ముందే 'రాజా ది గ్రేట్' బిజినెస్ అదుర్స్

రవితేజ మొదటిసారి ట్రై చేస్తున్న ఓ భిన్నమైన పాత్రకు మార్కెట్ వర్గాల నుంచి మంచి ఫలితమే కనిపిస్తోంది.

TNN 24 Sep 2017, 3:44 pm
రవితేజ మొదటిసారి ట్రై చేస్తున్న ఓ భిన్నమైన పాత్రకు మార్కెట్ వర్గాల నుంచి మంచి ఫలితమే కనిపిస్తోంది. అక్టోబర్ 12న రిలీజ్ కావాల్సి వున్న ఈ సినిమా విడుదలకి ముందే బిజినెస్‌లో దూసుకుపోతోంది. ఈ సినిమాకు సంబంధించిన శాటిలైట్ రైట్స్, డిజిటల్ రైట్స్, హిందీ డబ్బింగ్ రైట్స్ అన్నీ కలిపి అప్పుడే రూ.18 కోట్లు వచ్చేసినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. సాధారణంగా రవితేజ సినిమాలకి హిందీలో మంచి ఆదరణ వుంది. ఈ మాస్ మహారాజ నటించిన సినిమాల హిందీ డబ్బింగ్ వెర్షన్స్‌కి భారీ సంఖ్యలో ఫ్యాన్స్ వున్నారు. అందుకే రాజా ది గ్రేట్ హిందీ డబ్బింగ్ వెర్షన్ సైతం అప్పుడే అమ్ముడైనట్టు తెలుస్తోంది.
Samayam Telugu raja the greats satellite digital and hindi dubbing rights sold
విడుదలకి ముందే 'రాజా ది గ్రేట్' బిజినెస్ అదుర్స్


'పటాస్' ఫేమ్ అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో మాస్ మహారాజ సరసన మెహ్రీన్ పిర్జాద జంటగా నటించింది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకు సాయి కార్తిక్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. ఇటీవలే రిలీజైన టీజర్‌కి సైతం మంచి రెస్పాన్స్ కనిపించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.