యాప్నగరం

మాస్కోలో సందడి చేయనున్న బాహుబలి

బాహుబలి 2 సినిమాకు మరో అరుదైన గౌరవం దక్కింది. భారత్-రష్యాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు..

TNN 19 Jul 2017, 7:57 pm
బాహుబలి 2 సినిమాకు మరో అరుదైన గౌరవం దక్కింది. భారత్-రష్యాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మొదలై 70 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా చేపట్టనున్న వేడుకల్లో బాహుబలి సినిమా సందడి చేయనుంది. ఈ 70 వసంతాల వేడుకని దృష్టిలో పెట్టుకుని మాస్కోలో జరగనున్న 39వ మాస్కో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌లో భారతీయ చిత్రాల ప్రదర్శన కోసం ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి.
Samayam Telugu rajamouli to attend 39th moscow film festival to represent the indian film fraternity
మాస్కోలో సందడి చేయనున్న బాహుబలి


ఇదే వేదికపై భారత్ తరపున ప్రదర్శించనున్న చిత్రాల జాబితాలో బాహుబలి, బాహుబలి 2 చిత్రాలున్నాయి. అంతేకాకుండా మాస్కోలో జరిగే ఈ వేడుకలకి హాజరయ్యే ప్రపంచ సినీ ప్రముఖుల జాబితాలోనూ బాహుబలి డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి వున్నారు. భారత సినీ పరిశ్రమ ప్రతినిథిగా రాజమౌళి ఈ వేడుకలకి హాజరుకానున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.