‘RRR’ మరో అప్డేట్.. వచ్చే నెలలో సెట్స్‌పైకి!
రాజమౌళి, ఎన్టీఆర్, చరణ్ కాంబినేషన్లో సినిమా వస్తుందనే విషయం ఖరారైనా ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
Samayam Telugu 29 Oct 2018, 3:36 pm
దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్లో మల్టీస్టారర్ చిత్రం వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ ముగ్గురు పేర్లు వచ్చేలా ‘RRR’ అనే ప్రచార టైటిల్‌తో జాతీయ స్థాయిలో ఈ సినిమాపై చర్చ జరుగుతోంది. ‘బాహుబలి’ సిరీస్‌తో తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ వ్యాప్తి చేసిన రాజమౌళి తరవాత ప్రాజెక్టుపై దేశ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. దీనికి తోడు టాలీవుడ్లో ఇద్దరు అగ్రహీరోలతో సినిమా చేస్తుండటంతో భారీ అంచనాలున్నాయి.
రాజమౌళి, ఎన్టీఆర్, చరణ్ కాంబినేషన్లో సినిమా వస్తుందనే విషయం ఖరారైనా ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. తారక్, చరణ్ సైతం ఈ విషయాన్ని రాజమౌళే వెల్లడిస్తారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ‘RRR’కు సంబంధించి రోజుకో వార్త వైరల్ అవుతూనే ఉంది. ఈ సినిమా డిసెంబర్లో సెట్స్‌పైకి వెళ్తుందని.. సినిమాలో చరణ్, ఎన్టీఆర్ అన్నదమ్ములని, బాక్సర్లని.. ఎన్టీఆర్ నెగిటివ్ రోల్ పోషిస్తున్నారని.. ఇలా చాలా కథనాలు వెలువడ్డాయి. ఇప్పుడు ఇదే కోవలో మరో వార్త హల్చల్ చేస్తోంది.
ఈ సినిమా షూటింగ్ నవంబర్‌లో ప్రారంభమవుతుందని టాలీవుడ్ వర్గాల సమాచారం. ఇప్పటికే సినిమా కోసం ఎన్టీఆర్ కసరత్తులు మొదలుపెట్టేశారట. ఇంతకు మునుపెన్నడూ లేని విధంగా కొత్త లుక్‌లో ఎన్టీఆర్ ఈ సినిమాలో కనిపించనున్నారని టాక్. ఫస్ట్ షెడ్యూల్ అల్యూమినియం ఫ్యాక్టరీలో ఉంటుందని, ఈ షెడ్యూల్లో ఎన్టీఆర్ మాత్రమే పాల్గొంటారని అంటున్నారు. దీని తరవాత జనవరిలో రెండో షెడ్యూల్‌ను ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. కాగా, ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మించనున్నారు.