యాప్నగరం

నిర్మాత తనయుడితో రాజశేఖర్ కూతురు!

నటుడు రాజశేఖర్, నటి జీవిత దంపతుల కూతురు శివాని త్వరలోనే సినీ నటిగా తెరంగేట్రం చేయనున్న....

TNN 27 Jul 2017, 8:01 pm
నటుడు రాజశేఖర్, నటి జీవిత దంపతుల కూతురు శివాని త్వరలోనే సినీ నటిగా తెరంగేట్రం చేయనున్న సంగతి తెలిసిందే. శివాని ఎంట్రీకి సంబంధించి ప్రస్తుతం వైరల్ అవుతోన్న వార్త ఏంటంటే.. 'ఆమె తొలి సినిమాతోనే మరో నిర్మాత తనయుడు కూడా హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నడు' అని. అవును, నిర్మాత రాజ్ కందుకూరి తనయుడు శివ కందుకూరి ప్రస్తుతం పెన్సిల్వేనియాలోని పెన్న్ యూనివర్శిటీలో ఇంజనీరింగ్ చదువుకుంటున్నాడు. ఇంకొద్ది రోజుల్లోనే అతడి ఇంజనీరింగ్ పూర్తి కానుండటంతో వచ్చే జనవరిలో వీళ్లిద్దరినీ సినీ పరిశ్రమకి పరిచయం చేస్తూ ఓ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది.
Samayam Telugu rajasekhars daughter shivani to act with producers son
నిర్మాత తనయుడితో రాజశేఖర్ కూతురు!


ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ సైతం పూర్తి కావచ్చినట్టు సమాచారం. గతేడాది పెళ్లిచూపులు సినిమాతో సైలెంట్‌గా బిగ్గెస్ట్ హిట్ కొట్టిన రాజ్ కందుకూరినే ఈ సినిమాను నిర్మించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. దర్శకుడికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం వుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.