యాప్నగరం

ఫ్యాన్స్‌తో సమావేశాన్ని రద్దు చేసుకున్న రజినీకాంత్

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ అభిమానులకి మళ్లీ నిరాశే ఎదురైంది...

Samayam Telugu 8 Apr 2017, 2:18 pm
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ అభిమానులకి మళ్లీ నిరాశే ఎదురైంది. మొన్నటికి మొన్న శ్రీలంకలోని జాఫ్న పర్యటనని రద్దు చేసుకున్న రజినీకాంత్ తాజాగా తన అభిమానులతో సమావేశం అవుతానని ఇటీవల తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేసుకున్నారు. ఏప్రిల్ 12వ తేదీ నుంచి 16వ తేదీ వరకు అభిమానులతో సమావేశమవడంతోపాటు వారితో ఫోటో సెషన్‌ వుంటుందని గతంలో ప్రకటించిన రజినీకాంత్ తాజాగా తన మనసు మార్చుకున్నారు. భారీ సంఖ్యలో తరలివచ్చే అభిమానులతో విడివిడిగా ఫోటోలు తీసుకోవడం కష్టతరం అవుతుందనే కారణంతోనే రజినీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
Samayam Telugu rajinikanth cancels his meeting with fans
ఫ్యాన్స్‌తో సమావేశాన్ని రద్దు చేసుకున్న రజినీకాంత్


సూపర్ స్టార్‌తో సమావేశమై, అతడితో కలిసి ఫోటో తీసుకోవాలని ఇంతకాలంపాటు ఎంతో ఆశపడిన అభిమానులు నిరుత్సాహపడకుండా రజినీకాంత్ వారికి ఓ హామీ ఇచ్చినట్టు సమాచారం. భవిష్యత్‌లో జిల్లాల వారీగా అభిమానులతో వేర్వేరు సమావేశాలు నిర్వహిస్తానని... అలా అయితే, వారితో విడివిడిగా ఫోటోలు తీసుకోవడానికి ఇబ్బంది వుండదని పేర్కొన్నారు రజినీకాంత్. అలా ప్లాన్ చేసుకున్నట్టయితే, ఫోటో సెషన్‌కి సైతం మార్గం సులభం అవుతుందని.. అభిమానులు తనని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నానని అన్నారు రజినీకాంత్.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.