యాప్నగరం

ఖరీదైన కారు కొనుక్కున్న 'స్పైడర్' బ్యూటీ

ఎడాపెడా తెలుగు, తమిళం భాషల్లో సినిమాలు చేస్తూ ఈమధ్యే బాలీవుడ్‌లోనూ బిజీ అయ్యేందుకు ప్రయత్నిస్తోన్న రకుల్ ప్రీత్ సింగ్...

TNN 25 Sep 2017, 9:03 pm
ఎడాపెడా తెలుగు, తమిళం భాషల్లో సినిమాలు చేస్తూ ఈమధ్యే బాలీవుడ్‌లోనూ బిజీ అయ్యేందుకు ప్రయత్నిస్తోన్న రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా తన కోసం ఓ కొత్త ఖరీదైన ఎస్‌యువీ కారు కొనుక్కుంది. ప్రస్తుతం స్పైడర్ సినిమా ప్రమోషన్స్‌తో బిజీగా వుంటూనే మధ్యమధ్యలో తాను బాలీవుడ్‌లో చేస్తున్న సినిమా షూటింగ్‌కి హాజరవుతోంది. ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్ చివరి రోజునే కారు డెలవరీ అందుకున్న రకుల్.. షూట్ ముగించుకున్న వెంటనే కారులో చక్కర్లు కొట్టొచ్చిందట!
Samayam Telugu rakul preet gifts herself an expensive suv car
ఖరీదైన కారు కొనుక్కున్న 'స్పైడర్' బ్యూటీ

My new loveeee ! 😍 letsss zip 😀😀 A post shared by Rakul Singh (@rakulpreet) on Sep 24, 2017 at 7:58pm PDT
ఖరీదైన ఈ మెర్సిడెస్ బెంజ్ కారుపై వెనక్కి వాలిపోయి మై న్యూ లవీ అంటూ కెమెరాకి ఫోజిచ్చిన ఓ ఫోటోని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకుంది రకుల్. ఢిల్లీ తన స్వస్థలం కావడంతో రకుల్ ఈ వాహనాన్ని కూడా అక్కడే రిజిస్టేషన్ చేయించుకుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.