యాప్నగరం

కేంద్ర ప్రభుత్వ పథకానికి రకుల్ బ్రాండ్ అంబాసిడర్!

తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేసుకుంటూ హీరోయిన్‌గా బిజీగా వున్న రకుల్ ప్రీత్ సింగ్‌కి ఇటీవలే ఓ బాలీవుడ్‌ సినిమాలో అవకాశం...

TNN 12 Oct 2017, 3:22 pm
తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేసుకుంటూ హీరోయిన్‌గా బిజీగా వున్న రకుల్ ప్రీత్ సింగ్‌కి ఇటీవలే ఓ బాలీవుడ్‌ సినిమాలో అవకాశం వచ్చిన సంగతి తెలిసిందే. అలా బాలీవుడ్ సినిమాలో అవకాశం వచ్చిందో లేదో ఆ సినిమా ఇంకా రిలీజ్ కాకముందే కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఓ పథకానికి రకుల్ బ్రాండ్ అంబాసిడర్ అయిపోయింది. సౌతిండియాలో రెండు రాష్ట్రాల్లో వున్న ఫ్యాన్ ఫాలోయింగ్‌తోపాటు బాలీవుడ్ ఛాన్స్ రకుల్‌కి కలిసొచ్చిందో ఏమో తెలీదుకానీ నరేంద్ర మోదీ తీసుకొచ్చిన 'బేటీ బచావో, బేటీ పడావో' పథకాన్ని తెలంగాణలో ప్రమోట్ చేసే బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రభుత్వం నుంచి అవకాశం అందుకుందామె.
Samayam Telugu rakul preet singh is the new brand ambassador for beti bachao beti padhao
కేంద్ర ప్రభుత్వ పథకానికి రకుల్ బ్రాండ్ అంబాసిడర్!


టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా కొనసాగుతున్న రకుల్‌ప్రీత్ సింగ్ తనకి వచ్చిన ఈ అవకాశంపై ఆనందం వ్యక్తంచేసింది. తన నియామకాన్ని ఓ గౌరవంగా భావిస్తానని పేర్కొన్న రకుల్‌ప్రీత్ సింగ్.. సమాజంలో మార్పు మొదలవడానికి కృషిచేద్దాం అంటూ ట్విటర్ ద్వారా తన సంతోషాన్ని పంచుకుందామె.

రకుల్‌ప్రీత్ సింగ్ స్వస్థలం ఢిల్లీనే అయినప్పటికీ.. ఆమె టాలీవుడ్‌లో హీరోయిన్‌గా స్థిరపడటమే కాకుండా ఇటీవలే హైదరాబాద్, వైజాగ్ లాంటి ప్రాంతాల్లో ఫిట్‌నెస్ బిజినెస్‌లోకి అడుగుపెట్టారు. అంతేకాకుండా తాను చివరిగా హైదరాబాద్‌లోనే స్థిరపడతానని స్పష్టంచేశారామె.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.