Ram Charan - G20 Summit: టాలీవుడ్ అగ్ర కథానాయకుడు.. RRRతో గ్లోబల్ స్టార్ ఇమేజ్ దక్కించుకున్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. 2023లో భారత సినీ పరిశ్రమలో తనదైన మార్క్‌ను క్రియేట్ చేసి అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్న సంగతి తెలిసిందే. తాజాగా రామ్ చరణ్‌కి మరో అరుదైన గౌరవం దక్కింది. RRRలో అద్భుతమైన నటనను కనపరిచిన అందరి మెప్పును పొందిన ఆయన ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులందరికీ మరింత చేరువైన సంగతి తెలిసిందే. ఇంతకీ రామ్ చరణ్‌కి దక్కిన అరుదైన గౌరవం ఏంటో తెలుసా!.. G20 సమ్మిట్ - టూరిజం వర్కింగ్ గ్రూప్ మీటింగ్‌కు ఇండియన్ సినీ ఇండస్ట్రీ తరపున ప్రతినిధిగా పాల్గొనే అవకాశం.
శ్రీనగర్‌లో జరుగుతున్న G20 సమ్మిట్ - టూరిజం వర్కింగ్ గ్రూప్ మీటింగ్‌కు భారత సినీ పరిశ్రమ తరపున ఆయన ప్రతినిధిగా హాజరు కావటానికి బయలుదేరారు. ఇప్పుడా ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ప్రపంచంలో సినీ చిత్రీకరణకు సంబంధించిన ప్రాంతాల్లో మన దేశం యొక్క సామర్థ్యం గురించి ఆయన గొప్పగా తెలియజేయబోతున్నారట మన గ్లోబల్ స్టార్. ఈ క్రమంలో భారతదేశంలోని గొప్ప సాంస్కృతిక వైవిధ్యం, సుందరమైన ప్రదేశాలు, ఖర్చు, సినిమా ప్రభావం, అత్యాధునిక సాంకేతికతతో పాటు ఇది చలనచిత్ర నిర్మాణానికి అనువైన ప్రదేశంగా ఎలా మారిందనే విషయాలను చరణ్ బలంగా వినిపించున్నారని టాక్. G20లోని సభ్య దేశాలు మన దేశంలో చురుకైన భాగస్వామ్యం వహించాలని చరణ్ తెలియజేయనున్నారు.
ఇక సినిమాల విషయానికి వస్తే RRR తర్వాత రామ్ చరణ్ హీరోగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ చేంజర్’ అనే సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది సెప్టెంబర్నాటికంతా ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేస్తున్నారు. కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోన్న ఈ చిత్రంలో సునీల్, ఎస్.జె.సూర్య, శ్రీకాంత్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ డ్యూయెల్ రోల్ చేశారు. ఓ పాత్రలో ముఖ్యమంత్రిగా, మరో పాత్రలో ఎన్నికల అధికారిగా ఆయన కనిపించబోతున్నారు.
Thalapathy 68: దళపతి 68 ప్రకటన వచ్చేసింది.. డైరెక్టర్ ఎవరంటే!
Jr NTR: ఎన్టీఆర్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ.. థియేటర్‌ను తగలెట్టేసిన అత్యుత్సాహం

- Read Latest Telugu News and Tollywood Updates