యాప్నగరం

షెఫ్ అవతారమెత్తిన రామ్‌చరణ్..!!

‘రంగస్థలం’ సినిమా విజయంతో ఉత్సాహం మీదున్న హీరో రామ్ చరణ్ షెఫ్ అవతారం ఎత్తాడు

Samayam Telugu 18 Apr 2018, 12:36 pm
‘రంగస్థలం’ సినిమా విజయంతో ఉత్సాహం మీదున్న హీరో రామ్ చరణ్ షెఫ్ అవతారం ఎత్తాడు. ఇది ఏ సినిమా కోసమో కాదులెండి.. తన భార్య కోసం. రంగస్థలం ప్రచార పనులు కూడా దాదాపు పూర్తి అవుతుండటంతో ఇప్పుడు ఇంట్లో రిలాక్స్ అవుతున్నట్టున్నాడు చరణ్.అందులో భాగంగా భార్య కోసం వండిపెడుతూ ఇలా షెఫ్ అవతారమెత్తాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేసింది చరణ్ భార్య ఉపాసన.
Samayam Telugu ఉపాసన ట్వీట్


‘‘Master Chef 🍳👨🍳 #MrC cooking healthy breakfast for us post his workout. 🏋🏻‍♂#adorablehusband ❤😘 #ramcharan,”

అంటూ ట్వీట్ చేసిందామె. చరణ్‌ను మాస్టర్ షెఫ్‌గా అభివర్ణిస్తూ, తను హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ వండుతున్నాడంటూ ఉపాసన పేర్కొంది. భర్తను అండోరబుల్ హజ్బెండ్‌గా పేర్కొంటూ హ్యాష్ ట్యాగ్ పెట్టిందామె.

ఇక ఏప్రిల్ చివరి వారం నుంచి చరణ్ బోయపాటి సినిమా రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొననున్నట్టుగా తెలుస్తోంది. ఆ సినిమా ‘రాజవంశస్తుడు’ అనే టైటిల్ వినిపిస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.