Samantha Ruth Prabhu: రామ లక్ష్మికఎవరు? ఆమెకు చిట్టి బాబు బర్త్ డే విషెష్ చెబుతూ ట్వీట్ చేయటమేంటనే సందేహం రాక మానదు. రామ లక్ష్మి ఎవరో కాదు.. సమంత. మరి చిట్టి బాబు విషయానికి వస్తే అది మన రామ్ చరణ్. వీరిద్దరూ కలిసి రంగ స్థలంలో చేసిన పాత్రల పేర్లు అవి. శుక్రవారం (ఏప్రిల్ 28)న సమంత పుట్టినరోజు. సోషల్ మీడియాలో ఆమె అభిమానులు, సినీ ప్రేక్షకులతో పాటు సెలబ్రిటీలు సైతం ఆమెకు బర్త్ డే విషెష్ చెప్పారు. ఈ క్రమంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సమంతకు తన సోషల్ మీడియా ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేశారు. ‘‘ప్రియమైన సమంత నీ పట్ల, నీ పని పట్ల ఎంతో గర్వపడుతుంటాను. నీ ఆరోగ్యం బావుండాలని, మంచి సక్సెస్ దక్కాలని కోరుకుంటున్నాను. సిటాడెల్‌తో నీకు మంచి విజయం దక్కాలని ఆశిస్తున్నాను’’ అన్నారు. రామ్ చరణ్, సమంత కలిసి రంగస్థలం సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. రామ్ చరణ్ కెరీర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీగా ఇది నిలిచింది.
సమంత విషయానికి వస్తే.. ఆమె ఓ వైపు సినిమాలు, వెబ్ సిరీస్‌లంటూ బిజీగా ఉంటోంది. మరో వైపు మయోసైటిస్‌తో బాధపడుతుంది. కొన్నాళ్లు ముందు సామ్‌కు మయోసైటిస్ అనే కండరాల వ్యాధికి గురైనప్పుడు ఆమె తన సినీ కెరీర్లో కొనసాగుతుందా? అనే సందేహాన్ని చాలా మంది వ్యక్తం చేశారు. అయితే సమంత వాటన్నింటికీ తన కమ్ బ్యాక్‌తోనే సమాధానం చెప్పింది. ఇప్పుడు వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంటుంది. విజయ్ దేవరకొండతో ఈ చెన్నై బ్యూటీ చేస్తోన్న సినిమా ఖుషి. ఈ మూవీ సెప్టెంబర్ 1న రిలీజ్ అవుతుంది.
గత ఏడాది యశోద చిత్రంతో హిట్ అందుకున్న సమంత.. ఈ ఏడాది విడుదలైన శాకుంతలం సినిమాతో ప్లాప్‌ను చవి చూసింది. ఇప్పుడు ఖుషి సినిమాతో పాటు రాజ్ డీకే దర్శకత్వంలో సిటా డెల్ అనే వెబ్ సిరీస్‌లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో సామ్ యాక్షన్ రోల్లో నటిస్తుంది. ఇవి కాకుండా మరి కొన్ని క్రేజీ ప్రాజెక్టులు పైప్ లైన్లో ఉన్నాయి.