యాప్నగరం

నటుడిగా పదేళ్లు పూర్తి చేసుకున్న చెర్రీ!

మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా సినీరంగ ప్రవేశం చేసిన రామ్ చరణ్ గురువారంతో (సెప్టెంబర్ 28) ఇండస్ట్రీలో అడుగుపెట్టి పదేళ్లు పూర్తి చేసుకున్నాడు. చెర్రీ హీరోగా తెరకెక్కింన తొలి చిత్రం 'చిరుత' 2007 సెప్టెంబర్ 28న విడుదలైంది. చిరంజీవి వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన చరణ్ డెబ్యూ సినిమా మెగా అభిమానులకు మంచి కిక్ ఇచ్చింది.

TNN 28 Sep 2017, 9:29 pm
మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా సినీరంగ ప్రవేశం చేసిన రామ్ చరణ్ గురువారంతో (సెప్టెంబర్ 28) ఇండస్ట్రీలో అడుగుపెట్టి పదేళ్లు పూర్తి చేసుకున్నాడు. చెర్రీ హీరోగా తెరకెక్కింన తొలి చిత్రం 'చిరుత' 2007 సెప్టెంబర్ 28న విడుదలైంది. చిరంజీవి వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన చరణ్ డెబ్యూ సినిమా మెగా అభిమానులకు మంచి కిక్ ఇచ్చింది. దానికి తగ్గట్టే తన నటనతోనూ చెర్రీ ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా డాన్సుల్లో తండ్రికి ఏమాత్రం తక్కువ కాదని మొదటి సినిమాతోనే రుజువు చేశాడు.
Samayam Telugu ram charan completes 10 years as hero in telugu industry
నటుడిగా పదేళ్లు పూర్తి చేసుకున్న చెర్రీ!


పూరీ జగన్నాథ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఇప్పటివరకూ ఎంట్రీ ఇచ్చిన అందరి హీరోల అరంగేట్ర సినిమాల కంటే ఎక్కువ కలెక్షన్స్ రాబట్టింది. ఆ తర్వాత దర్శకధీరుడు రాజమౌళితో చేసిన 'మగధీర' సినిమా చెర్రీని మరో స్థాయికి తీసుకెళ్లింది. ఈ సినిమా విడుదలైన నాలుగేళ్ల పాటు దాని రికార్డ్స్‌ను ఏ సినిమా క్రాస్ చేయలేకపోవడం విశేషం.

దశాబ్ద కాలంలో చెర్రీ నటించిన సినిమాల తక్కువే అయినా.. తనదైన శైలిలో జాగ్రత్తగా కథలు ఎంచుకుంటున్నాడు. రచ్చ, నాయక్, ఎవడు, ధృవ చిత్రాలతో నటుడిగా మంచి గుర్తింపు సాధించాడు. ఆరెంజ్, గోవిందుడు అందరివాడేలే లాంటి సినిమాల్లో తన నటనతో విమర్శకుల ప్రశంసలు పొందాడు.

మగధీర సినిమాకు చరణ్.. ‘బెస్ట్ యాక్టర్ ఫిల్మ్ ఫేర్ అవార్డ్’ అందుకున్నాడు. డీమానిటైజేషన్ సమయంలో విడుదలైన ధృవ సినిమా రూ. 60 కోట్ల వరకూ వసూళ్లు చేయడం మరో రికార్డ్‌గా చెప్పొచ్చు. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో చరణ్ నటిస్తోన్న 'రంగస్థలం 1985' సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.