యాప్నగరం

RRR అప్‌డేట్.. వచ్చే నెలలో మెగా అభిమానులకు స్వీట్ గిఫ్ట్!

వచ్చే నెలలో రామ్ చరణ్ పుట్టినరోజు ఉంది. మార్చి 27న చరణ్ బర్త్ డే. ఇదే రోజు రామ్ చరణ్ ‘RRR’ లుక్‌ను విడుదల చేయబోతున్నారని టాక్.

Samayam Telugu 14 Feb 2019, 6:23 pm
ప్రస్తుతం టాలీవుడ్‌లో తెరకెక్కుతోన్న క్రేజీ మూవీస్‌లో ‘RRR’ ఒకటి. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ప్రస్తుతం సెకండ్ షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమాపై అప్పుడే లెక్కలేనన్ని వార్తలు, రూమర్లు. ఈ సినిమా కథ మన దేశానికి స్వాతంత్య్రం రావడానికి ముందు ప్రారంభమవుతుందని.. ఎన్టీఆర్ బందిపోటుగా, చరణ్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తారని.. ఇలా చాలా వార్తలే వచ్చాయి. ఈ వార్తల్లో నిజమెంతో తెలియదు కానీ ఇప్పటి వరకు చిత్ర యూనిట్ నుంచి అధికారికంగా ఒక్క అప్‌డేట్ కూడా రాలేదు. అయితే వచ్చే నెలలో మాత్రం కచ్చితంగా ఒక అఫిషియల్ అప్‌డేట్ వస్తుందని ప్రస్తుతం ఫిల్మ్ నగర్ టాక్.
Samayam Telugu Ram-charan


వచ్చే నెలలో రామ్ చరణ్ పుట్టినరోజు ఉంది. మార్చి 27న చరణ్ బర్త్ డే. ఇదే రోజు రామ్ చరణ్ ‘RRR’ లుక్‌ను విడుదల చేయబోతున్నారని టాక్. ఈ పోస్టర్‌లో సినిమా టైటిల్‌ను రివీల్ చేయరట. ప్రస్తుతం నడుస్తోన్న RRR టైటిల్‌తోనే పోస్టర్ వస్తుందట. ఈ పోస్టర్‌తోనే RRR అసలు ప్రమోషన్స్ ప్రారంభమవుతాయని అంటున్నారు. ఇక మే నెలలో వచ్చే ఎన్టీఆర్ పుట్టినరోజుకు ఆయన లుక్‌ను కూడా విడుదల చేస్తారని టాక్.

వాస్తవానికి రాజమౌళి సినిమాల ప్రచార వ్యవహారాలను ఆయన తనయుడు కార్తికేయ చూసుకుంటూ ఉంటారు. పోస్టర్ల తయారీ, ప్రమోషనల్ వీడియో మేకింగ్ ఇలా అన్ని ప్రచార కార్యక్రమాలు చూసుకునేది ఆయనే. ‘బాహుబలి’ సిరీస్‌కు పాత్రల పోస్టర్లతో ఎంత క్రేజ్ వచ్చిందో అందరికీ తెలిసిందే. ఈ ఘనత కార్తికేయదేనట. ఇప్పుడు ఈ మల్టీస్టారర్‌కు కూడా కార్తికేయనే పనిచేస్తున్నారని అంటున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ లుక్‌ను పోస్టర్ రూపంలో తీసుకురావడానికి కార్తికేయ ప్రయత్నిస్తున్నారట. మొత్తానికి మార్చి 27న మెగా అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్ అందబోతోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.