యాప్నగరం

వైరల్: ఎన్టీఆర్-చెర్రీ ఫ్యాన్స్‌కి కిక్ ఇచ్చే పిక్

టాలీవుడ్‌లో యంగ్ టైగర్ ఎన్టీఆర్.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఇద్దరూ ఇద్దరే. ఫ్యాన్స్‌లో ఈ హీరోలకు బీభత్సమైన ఫాలోయింగ్. ఇక ఆ హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే అభిమానుల హంగామా గురించి చెప్పాల్సిన పనిలేదు.

TNN 30 Sep 2017, 1:13 pm
టాలీవుడ్‌లో యంగ్ టైగర్ ఎన్టీఆర్.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఇద్దరూ ఇద్దరే. ఫ్యాన్స్‌లో ఈ హీరోలకు బీభత్సమైన ఫాలోయింగ్. ఇక ఆ హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే అభిమానుల హంగామా గురించి చెప్పాల్సిన పనిలేదు. తమ హీరో గొప్ప అంటే తమ హీరో గొప్ప అంటూ సోషల్ మీడియాలో రచ్చ మామూలుగా ఉండదు. అయితే మన టాలీవుడ్ హీరోలు సందర్భం వచ్చిన ప్రతిసారీ చొక్కాలు చింపుకునే ఫ్యాన్స్‌కి చురకలేస్తూనే ఉంటారు. మహేష్, ప్రభాస్, పవన్, ఎన్టీఆర్, చెర్రీ అందరూ పలు సందర్భాల్లో టాలీవుడ్ అనేది ఒక కుటుంబం ఇందులో నటించే వారందరూ కుటుంబ సభ్యుల్లా కలిసి మెలసి ఉంటాం అంటూ ఫ్యాన్స్‌ను మధ్య పోరు నడిచే సందర్భంలో బహిరంగంగానే క్లాస్ పీకారు.
Samayam Telugu ram charan hugs jr ntr after watching jai lava kusa movie
వైరల్: ఎన్టీఆర్-చెర్రీ ఫ్యాన్స్‌కి కిక్ ఇచ్చే పిక్


వీరిలో ఎన్టీఆర్ ఒక అడుగు ముందుకు వేసి మిగతా హీరోలను విమర్శించే వాళ్లు అభిమానులు కాలేరంటూ ఇటీవల ‘జై లవకుశ’ చిత్ర విడుదల సందర్భంగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. స్టార్ హీరోలందరూ ఫ్రెండ్ ఫిప్‌ను కంటిన్యూ చేసుకుంటూ ముందుకు వెళుతుంటే వారి ఫ్యాన్స్ మధ్య వార్ కొనసాగుతూనే ఉంటుంది. అటువంటి ఫ్యాన్స్ కోసమే ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు ఓ లవ్లీ పిక్ దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పిక్ వైరల్‌గా మారింది. ఈ పిక్‌ను ‘జై లవకుశ’ మూవీకి పనిచేసిన కోనా వెంకట్ ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు.

I'm really touched by the way the fans are reacting to a genuine gesture by Ramcharan.. Tarak also equally touched.. We are ONE .. TFI 👍 pic.twitter.com/FyVIohKoVG — kona venkat (@konavenkat99) September 29, 2017
అభిమానులు ఊహించని విధంగా టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు ఒకరిర్నొకరు కౌగిలించుకుని ‘స్నేహమేరా జీవితం ’ అంటూ దిగిన ఫోటో హాట్ టాపిక్ అయ్యింది. తాజాగా ఎన్టీఆర్ నటించిన ‘జై లవకుశ’ మూవీ చూసిన రామ్ చరణ్ ఇటీవల ఎన్టీఆర్‌కి ఫోన్ చేసి విషెష్ చెప్పిన సంగతి తెలిసిందే. కాగా ఎన్టీఆర్ ఇచ్చిన ‘జై లవకుశ’ సక్సెస్ పార్టీలో పాల్గొన్న రామ్ చరణ్ ఎన్టీఆర్‌కి హగ్ ఇస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. అయితే వీరి ఫ్రెండ్ షిప్ ఇప్పటిదే కాదు గతంలో ఎన్టీఆర్ ‘బాద్ షా’ సినిమా ప్రారంభానికి రామ్ చరణ్ వెళ్లడమే కాకుండా వాళ్లిద్దరూ ఒకే కార్లో కులాసాగా కలిసివెళ్లారు. అయితే కేవలం చెర్రీ, ఎన్టీఆర్‌లే కాకుండా ఇటీవల రామ్ చరణ్ మహేష్‌తో కలిసి ఫారిన్‌లో చక్కర్లు కొట్టారు. మొత్తానికి టాలీవుడ్‌ టాప్ హీరోలు స్నేహ మేరా జీవితం అంటూ పార్టీల్లో కలిసినట్టే.. సినిమాల్లో కూడా కలిసి నటిస్తే ఫ్యాన్స్‌కి అంతకంటే పెద్ద పండుగ ఏముంటుంది చెప్పండి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.