యాప్నగరం

ఖైదీలో కలసి చిందేస్తున్న తండ్రీకొడుకులు?

మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం ‘ఖైదీ నెం 150’ చిత్రంపై టాలీవుడ్‌లో రోజుకో వార్త చక్కర్లు కొట్టి సినిమాపై అంచనాలను అంతకంతకూ పెంచేస్తుంది.

TNN 1 Dec 2016, 8:00 pm
మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం ‘ఖైదీ నెం 150’ చిత్రంపై టాలీవుడ్‌లో రోజుకో వార్త చక్కర్లు కొట్టి సినిమాపై అంచనాలను అంతకంతకూ పెంచేస్తుంది. ఈ సినిమా ఆడియో ఫంక్షన్‌కి భారీ తారాగణమే తరలివస్తుందని, టాలీవుడ్‌తో పాటు అన్ని ఉడ్‌ల స్టార్ హీరోలు మెగా ఫంక్షన్‌కు హాజరవుతున్నారని, పవర్ స్టార్‌ ఈ ఆడియో ఫంక్షన్‌లో ప్రత్యేక ఆకర్షణ కానున్నాడంటూ రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ‘ఖైదీనెం.150’ సినిమాలో చిరుతో కలిసి తనయుడు రాంచరణ్ ఓ పాటలో కనిపించబోతున్నాడంటూ మరో న్యూస్ బయటకు వచ్చింది.
Samayam Telugu ram charan in khaidi no 150 movie
ఖైదీలో కలసి చిందేస్తున్న తండ్రీకొడుకులు?


మెగాస్టార్ సినిమాల్లో డాన్స్‌కి లోటు ఉండదు అతని డాన్సింగ్‌ స్టైల్‌కి ఫిదా కాని అభిమానులు ఉండరు. ఇప్పుడు అతనికి తోడుగా రాంచరణ్ కలవనున్నాడట. తండ్రీకొడుకులిద్దరూ ఒక సాంగ్‌లో స్టెప్పులు వేయడానికి రెడీ అయ్యారని టాక్.

గతంలో చిరంజీవి రామ్ చరణ్ ‘మగధీర’ ‘బ్రూస్లీ’లో కనిపించి అలరించాడు. ఇప్పుడు చిరు సినిమాలో చెర్రీ కనిపించి మెగా అభిమానులకు సప్రైజ్ ఇవ్వబోతున్నాడు. ఇటీవల రాంచరణ్ ‘ఖైదీనెం.150’చిత్రంలో అవకాశం ఉంటే తన తండ్రితో కలసి చిన్న రోల్‌ అయినా చేయాలని ఉందని తెలిపారు. ఇప్పుడు తన కోరికను ఇలా తీర్చుకోబోతున్నాడన్నమాట.

అయితే కేవలం రాంచరణ్ ఒక సాంగ్‌లో మాత్రమే కనిపిస్తాడా లేక ఏదైనా ప్రత్యేక పాత్ర చేస్తున్నాడా.. అన్న విషయాలపై తొందరలోనే క్లారిటీ రావచ్చు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.