యాప్నగరం

సీసీటీ స్వాంతత్య్ర దినోత్సవ వేడుకల్లో రామ్ చరణ్

ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కూడా పాల్గొన్నారు. మహాత్మాగాంధీ చిత్ర పటానికి రామ్ చరణ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు.

Samayam Telugu 15 Aug 2020, 1:19 pm
ఇవాళ 74వ స్వాంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. దేశ వ్యాప్తంగా కరోనా భయంతో చాలామంది వేడుకలకు దూరమయ్యారు. కరోనా నిబంధనలు పాటించి ప్రభుత్వ కార్యాలయాల్లో వేడుకలు నిరాడంబరంగా జరుపుకున్నాయి. అందరు తమ తమ కార్యాలయాలలో జాతీయ జెండాని ఎగుర వేసి దేశభక్తిని చాటుకుంటున్నారు. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇండిపెండెన్స్ సెలబ్రేషన్స్‌లో పాల్గొన్నారు. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌లో అల్లు అరవింద్‌తో కలిసి ఇండిపెండెన్స్ సెలబ్రేషన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహాత్ముడి ఫోటోకు పూలమాలలు వేసి రామ్ చరణ్ నివాళులర్పించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలు వైరల్ అవుతున్నాయి.
Samayam Telugu రామ్ చరణ్
ram charan


ఇక ఐకమత్యం చాటుకోవడానికి 65 మంది సింగర్స్ 5 భాషలలో దేశ భక్తి పాట పాడారు. వినరా వినరా రేపిక మనదేరా అంటూ పాడిన సాంగ్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఈ పాటని రామ్ చరణ్ తన సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. ఈ క్లిష్ట సమయంలో అందరం ఒక్కటే అంటూ ఐకమత్యం చాటడానికి ఇంత మంది సింగర్స్ కలిసి పని చేయడం ఆనందంగా ఉందని చరణ్ పేర్కొన్నారు.
మరోవైపు స్వాంతత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా రామ్ చరణ్, చిరంజీవి ట్వీట్ చేశారు. ప్రజలందరికీ 74వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశం కోసం పోరాడి ప్రాణాలు అర్పించిన మహనీయులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు సినిమా సెలబ్రిటీలు సైతం ట్వీట్లు చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.