యాప్నగరం

ఇక నా వల్ల కాదు... రామ్ చరణ్ ఇంట్రస్టింగ్ ట్వీట్

రామ్ చరణ్ ట్విట్టర్ వేదికగా సినిమా షూటింగ్స్ పై స్పందించాడు. వీలైనంత త్వరగా షూటింగ్ వెళ్లాలని ఉందన్నాడు. ఇక వెయిట్ చేయడం నా వల్లకాదంటూ ఆసక్తికరంగా ట్వీట్ చేశాడు.

Samayam Telugu 16 May 2020, 2:54 pm
లాక్ డౌన్‌తో సినీ తారలంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. షూటింగ్స్ లేకపోవడంతో ఇంట్లోనే గడుపుతున్నారు. దాదాపు మూడు నెలలుగా ఇంట్లోనే ఉండటంతో అంతా బోర్ అయిపోతున్నారు. పని పాటలేక ఇంట్లో గడపడం కష్టంగా ఉందంటూ భారంగా ఫీల్ అవుతున్నారు. ఇంట్లోనే రకరకాల పనులు చేస్తూ కొందరు టైమ్ పాస్ చేస్తున్నారు. తాజాగా రామ్ చరణ్ ఈ విషయమై ట్వీట్ చేశారు. ధృవ సినిమా సెట్స్‌లో దిగిన ఫోటోలని షేర్ చేస్తూ.. సెట్స్‌ కి తిరిగి వెళ్ళడానికి ఇక వేచి ఉండలేను. అయితే అప్పటి వరకు, ఇంట్లోనే ఉండి సురక్షితంగా ఉండాలి' అంటూ చరణ్ పోస్ట్ చేశాడు. దీని బట్టి చూస్తే చరణ్‌కు ఇంట్లో ఎంత బోర్ కొడుతుందో అర్థం చేసుకోవచ్చు.
Samayam Telugu రామ్ చరణ్


రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చిత్రంలో అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తున్నాడు. తాజాగా చరణ్‌కు సంబంధించిన వీడియోని బర్త్‌డే సందర్భంగా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. భీమ్ ఫర్ రామరాజు అంటూ వచ్చిన వీడియోలో.. చరణ్‌ నటిస్తున్న 'అల్లూరి' పాత్ర గురించి విడుదలైన వీడియో ఫ్యాన్స్ అంచనాలని డబుల్ చేసింది. ఈ వీడియోకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ వాయిస్ అందించారు. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక దీనికి ‘రౌద్రం రణం రుధిరం’ టైటిల్‌ను ఖరారు చేశారు. అయితే ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ చేయబోయే సినిమా పై కూడా ఆసక్తికరమైన అప్ డేట్స్ వస్తున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.