యాప్నగరం

లుక్‌ కిక్: 'రంగస్థలం' జాతరలో రామ్ చరణ్

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో 'రంగస్థలం 1985' సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ చివరి దశలో ఉంది.

TNN 7 Nov 2017, 1:24 pm
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో 'రంగస్థలం 1985' సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ చివరి దశలో ఉంది. ఇటీవల రామ్ చరణ్ ఈ సినిమా సెట్ ఫోటోలు విడుదల చేసి అందరిలో ఆసక్తిని క్రియేట్ చేశారు. ఇప్పుడు చిత్రనిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్ వారు సినిమా సెట్‌కు సంబంధించిన ఒక ఫోటోను అభిమానులతో పంచుకున్నారు.
Samayam Telugu ram charan new look in rangasthalam 1985 jaatara
లుక్‌ కిక్: 'రంగస్థలం' జాతరలో రామ్ చరణ్


'రంగస్థలం జాతర' అంటూ పోస్ట్ చేసిన ఈ ఫోటోలో రామ్ చరణ్ వెనక నుండి రంగు రంగుల బొమ్మల చొక్కా వేసుకొని పల్లెటూరు కుర్రోడిలా కనిపిస్తున్నాడు. ఆ సెట్‌లో రంగులరాట్నం, బొమ్మలు ఇలా వాతావరణం మొత్తం కూడా చాలా కలర్ ఫుల్‌గా కనిపిస్తోంది. ఈ పోస్టర్ సినిమాపై అమితాసక్తిని కలిగిస్తోంది. నిజానికి మొదట సంక్రాంతి కానుకగా ఈ సినిమాను విడుదల చేయాలని దర్శకనిర్మాతలు భావించారు. కానీ కొన్ని కారణాల వలన ఇప్పుడు సినిమా రిలీజ్‌ను మార్చికి వాయిదా వేశారు. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన సమంత హీరోయిన్‌గా కనిపించనుంది. అలానే మరో ముఖ్య పాత్రలో అనసూయ కూడా నటిస్తుండగా.. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను పల్లెటూరి నేపధ్యంలో సాగే ప్రేమకథగా తెరకెక్కిస్తున్నాడు సుకుమార్.

#Rangasthalam Jaatara 😍 pic.twitter.com/WENea5wedL — Mythri Movie Makers (@MythriOfficial) November 6, 2017

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.