యాప్నగరం

అఫీషియల్ అనౌన్స్: కొరటాలతో చెర్రీ

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన అభిమానులకు ఊహించని గిఫ్ట్ ఇచ్చాడు. హ్యాట్రిక్ హిట్ చిత్రాల దర్శకుడు కొరటాల శివతో సినిమా చేస్తున్నట్లుగా అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు.

TNN 11 Jul 2017, 12:40 pm
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన అభిమానులకు ఊహించని గిఫ్ట్ ఇచ్చాడు. హ్యాట్రిక్ హిట్ చిత్రాల దర్శకుడు కొరటాల శివతో సినిమా చేస్తున్నట్లుగా అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. ఈ సినిమాను మాట్నీ ఎంటర్టైన్మెంట్స్‌తో కలిసి చరణ్ తన బ్యానర్ కొణిదల ప్రొడక్షన్స్‌పై నిర్మించనున్నారు. 2018 వేసవి నుండి ఈ సినిమాను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.
Samayam Telugu ram charan next movie with koratala
అఫీషియల్ అనౌన్స్: కొరటాలతో చెర్రీ


దీంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. దర్శకుడిగా కొరటాల శివకు మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. ఆయన డైరెక్ట్ చేసిన మూడు సినిమాలు కూడా సూపర్ హిట్స్. ప్రస్తుతం మహేష్ బాబుతో కలిసి 'భరత్ అను నేను' అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. అలానే చరణ్.. సుకుమార్ దర్శకత్వంలో 'రంగస్థలం' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాలు కూడా సంక్రాంతికి విడుదల చేయాలనుకుంటున్నారు. ఆ తరువాత కొరటాలతో కలిసి చరణ్ సెట్స్ పైకి వెళ్లనున్నాడు. మిర్చి సినిమా తరువాత కొరటాల.. చరణ్‌తో ఓ సినిమా చేయాలనుకున్నాడు. కానీ కొన్ని కారణాల వలన ఆ సినిమా సెట్స్ పైకి వెళ్లకుండా ఆగిపోయింది. ఆ తరువాత చాలా సార్లు చరణ్‌తో సినిమా ఉంటుందని చెప్పారు కొరటాల. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమాపై అధికార ప్రకటన ఇచ్చేశారు. మొత్తానికి ఎప్పటినుండో అభిమానులు ఎదురుచూస్తోన్న ఈ కాంబో ఇప్పటికీ సెట్ అయింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.