యాప్నగరం

నాని డైరెక్టర్‌తో రామ్ చరణ్ మూవీ ?

న్యాచురల్ స్టార్ నానిని డైరెక్ట్ చేసిన దర్శకుడితో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఓ సినిమాకి ప్లాన్...

TNN 19 Jul 2017, 11:32 am
నేను లోకల్ సినిమాతో న్యాచురల్ స్టార్ నానిని డైరెక్ట్ చేసిన దర్శకుడితో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఓ సినిమాకి ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్‌లో రంగస్థలం 1985 సినిమాతో బిజీగా వున్న చెర్రీ ఆ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమాకు కమిట్ అయ్యాడు. కొరటాల శివతో సినిమా పూర్తయ్యాకా నేను లోకల్ సినిమా దర్శకుడు త్రినాథ రావు నక్కినతో సినిమా చేసే అవకాశాలున్నాయి.
Samayam Telugu ram charan planning a movie with nenu locals director
నాని డైరెక్టర్‌తో రామ్ చరణ్ మూవీ ?


త్రినాథ రావు వినిపించిన యాక్షన్ స్టోరీ లైన్ నచ్చడంతో పూర్తి స్క్రిప్ట్‌తో రావాల్సిందిగా సూచించారట చరణ్. చరణ్ చెప్పిన సూచనలే మేరకు ఆ స్టోరీని డెవలప్ చేసే పనిలో పడ్డారు త్రినాథ రావు. త్రినాథ రావు డెవలప్ చేసిన స్టోరీ కానీ చరణ్‌ని ఆకట్టుకుంటే, కొరటాల-చరణ్‌ల సినిమా పూర్తయిన తర్వాత వచ్చే ఏడాది వీళ్లిద్దరి సినిమానే సెట్స్‌పైకి వెళ్లే అవకాశం వుంది. సినీవర్గాలు చెబుతున్న వివరాల ప్రకారం ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను నిర్మించే ఛాన్స్ వున్నట్టు సమాచారం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.