యాప్నగరం

అది మాకు చెప్పకుండా తీశారు.. కొరటాలపై రామ్ చరణ్ కామెంట్స్

ఆచార్య చిత్రం ఏప్రిల్ 29న రాబోతోంది. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్లు పెంచేశారు. ఇందులో భాగంగా రామ్ చరణ్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు.

Authored byబండ కళ్యాణ్ | Samayam Telugu 25 Apr 2022, 9:40 pm
మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్‌లో రాబోతోన్న ఆచార్య విడుదలకు సిద్దంగా ఉంది. ఏప్రిల్ 29న ఈ చిత్రం రాబోతోంది. ఈ క్రమంలోనే ప్రమోషన్లు పెంచేశారు. తాజాగా రామ్ చరణ్ ఓ ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నాడు. ట్రైలర్‌లో అందరికీ నచ్చిన ఓ షాట్ ఉంటుంది. చివర్లో ఉండే ఆ షాట్‌కు ప్రతీ ఒక్క ప్రేక్షకుడూ ఫిదా అయి ఉంటాడు. చివర్లో వచ్చే చిరుత పులి, పులి షాట్.. చిరంజీవి, రామ్ చరణ్ షాట్‌కు అందరూ ఆశ్చర్యపోయారు.
Samayam Telugu అది మాకు చెప్పకుండా తీశారు.. కొరటాలపై రామ్ చరణ్ కామెంట్స్
Ram Charan Koratala Siva


ఆ సీన్ గురించి తాజాగా రామ్ చరణ్ చెప్పాడు. అసలు అలాంటి ఓ సీన్ తీయబోతోన్నాడని కొరటాల శివ ముందుగా చెప్పనేలేదట. ప్యాకప్ చెప్పి వేళ్లే చివరి క్షణంలో ఓ షాట్ ఉందని కొరటాల చెప్పాడట. కాలువ దగ్గర మీరు అలా వాటర్ తాగుతూ ఉండండి.. చిరంజీవి గారు అలా చుట్టూ చూస్తారని చెప్పాడట. యంగర్ కామ్రెడ్ వాటర్ తాగుతుంటే.. అలా సీనియర్ కామ్రెడ్ చుట్టూ చూస్తుంటాడు.. చుట్టూ అడవి కాబట్టి ఏదైనా డేంజర్ ఉంటుందేమోనని అందుకే అలా చూస్తాడేమోనని నేను అనుకున్నానంటూ రామ్ చరణ్ చెప్పుకొచ్చాడు.

అయితే కెమెరా అలా పక్క నుంచి మా మీదకు వస్తుండటంతో చిరంజీవి అడిగాడట. అలా ఎందుకు కెమెరా అక్కడి నుంచి వస్తోంది.. ఏమైనా డేంజర్ ఉందా? అక్కడ అని కొరటాలను అడిగాడట చిరు. కానీ కొరటాల ఏమీ చెప్పలేదట. మొత్తానికి ఆ షాట్ అయిపోయివడంతో ప్యాకప్ చెప్పి వెళ్లిపోయారట. చివర్లో అసలు విషయం చెప్పాడట. మీకు ముందు.. చిరుత పులి, చిరుత ఉంటుందని చెప్పడంతో చిరంజీవి, రామ్ చరణ్ ఆశ్చర్యపోయారట. మొత్తంగా ఆ షాట్‌ను పదిహేను నిమిషాల్లో తీసేశారట. ఆ షాటే తనకు ఇష్టమని రామ్ చరణ్ పేర్కొన్నాడు.
రచయిత గురించి
బండ కళ్యాణ్
బండ కళ్యాణ్ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ సినిమా రంగానికి సంబంధించిన తాజా వార్తలు, స్టోరీలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాజకీయం, సినిమా రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.