యాప్నగరం

Pawan Kalyan ‘సైరా’ ట్రైలర్ లాంఛ్.. పవన్ గురించి సీక్రెట్ రివీల్ చేసిన రామ్ చరణ్

Sye Raa Trailer: మెగా అభిమానులతో పాటు సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తోన్న మోస్ట్ వెయిటెడ్ మూవీ ‘సైరా నరసింహారెడ్డి’ ట్రైలర్ కొద్దిసేపటి క్రితం హైదరాబాద్‌లోని ఐమాక్స్‌లో విడుదలైంది.

Samayam Telugu 18 Sep 2019, 6:09 pm
మెగా అభిమానులకు నేడు పండగ రోజునే చెప్పాలి. మెగాస్టార్ చిరంజీవి నటించిన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘సైరా నరసింహారెడ్డి’ చిత్ర ట్రైలర్‌ను నేడు (సెప్టెంబర్ 18) విడుదల చేయడంతో యూట్యూబ్ షేక్ అవుతోంది.
Samayam Telugu Sye Raa Narasimha Reddy Trailer Launch
Sye Raa Narasimha Reddy Trailer


కొద్దిసేపటి క్రితం విడుదలైన ఈ ట్రైలర్ ప్రేక్షకుల అంచనాలను రెట్టింపు చేసింది. మూడు నిమిషాల నిడివితో ఉన్న ఈ ట్రైలర్‌లో ‘సైరా నరసింహారెడ్డి’గా చిరంజీవి ఉగ్రరూపం దాల్చారు. సురేందర్ రెడ్డి టేకింగ్ హాలీవుడ్ రేంజ్‌లో ఉండంటంతో ‘సైరా’ బాక్సాఫీస్‌ రికార్డుల్ని బ్రేక్ చేయడం ఖాయమే అంటున్నారు.

Read Also: ‘సైరా’ ట్రైలర్.. మీకెందుకు కట్టాలిరా శిస్తు

ఇక ఈ ట్రైలర్ లాంఛ్ కార్యక్రమంలో ఆసక్తికరమైన విషయాన్ని తెలియజేశారు చిత్ర నిర్మాత రామ్ చరణ్. సైరా టీజర్‌లో పవన్ కళ్యాణ్ వాయిస్‌ను ఉపయోగించుకున్నారు. సినిమాలో కూడా ఉంటుందా? అని విలేకరి అడగ్గా.. జై పవర్ స్టార్ నినాదాలు మారుమోగాయి. దీంతో రామ్ చరణ్ ఏంటి మళ్లీ అడగండి అంటూ.. దర్శకుడు సురేందర్ రెడ్డిని చెప్పొచ్చా అని పర్శిషన్ తీసుకుని.. సినిమాలో కూడా పవన్ వాయిస్ ఉంటుందని సీక్రెట్ రివీల్ చేశారు రామ్ చరణ్ తేజ్.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.