యాప్నగరం

Ram Charan: ఇదంతా నమ్మశక్యంగా లేదు.. ప్రామిస్‌గా చెబుతున్నా! పూరి జగన్నాథ్‌పై రామ్ చరణ్ కామెంట్స్

రామ్ చరణ్ మొదటి సినిమా 'చిరుత' విడుదలై నేటితో 13 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సోషల్ మీడియా ద్వారా ఆ సినిమాను గుర్తు చేసుకున్నారు మెగా పవర్ స్టార్. చిత్రయూనిట్ మొత్తానికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు.

Samayam Telugu 28 Sep 2020, 3:56 pm
కొణిదెల వారసుడిగా 2007 సంవత్సరంలో సినీ గడపతొక్కారు రామ్ చరణ్. 2007 సెప్టెంబర్ 28 అంటే సరిగ్గా ఈ రోజు చెర్రీ మొదటి సినిమా చిరుత రిలీజయ్యింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మెగా అభిమానులను యమ హుషారెత్తించింది. మొదటి సినిమాలోనే రామ్ చరణ్‌ని పర్ఫెక్ట్ హీరోగా ప్రెజెంట్ చేశారు పూరి. ఆ తర్వాత వరుస హిట్స్ రాబట్టిన చెర్రీ.. మెగా పవర్ స్టార్‌గా అశేష అభిమాన వర్గాన్ని కూడగట్టుకున్నారు. అయితే 'చిరుత' మూవీ విడుదలై నేటితో 13 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సోషల్ మీడియా ద్వారా ఆ సినిమాను గుర్తు చేసుకున్నారు రామ్ చరణ్.
Samayam Telugu ప్రామిస్‌గా చెబుతున్నా! పూరి జగన్నాథ్‌పై రామ్ చరణ్ కామెంట్స్
Ram Charan Puri Jagannadh


''అప్పుడే 13 సంవత్సరాలు అయిపోయాయంటే నమ్మలేకపోతున్నా. ఈ పయనంలో ఎన్నో విజయాలు, అపజయాలు తలుపుతట్టాయి. కానీ అన్నింటినీ ఎంజాయ్ చేశా. అన్నివేళలా నాకు అండగా నిలిచిన అభిమానులకు ధన్యవాదాలు. ప్రామిస్.. మున్ముందు మరింత కష్టపడి మిమ్మల్ని సంతోషపెడతాను'' అని పేర్కొంటూ ట్వీట్ చేశారు రామ్ చరణ్.

Also Read: గత రాత్రి అంటూ హాట్ వీడియో షేర్ చేసిన స్టార్ హీరోయిన్.. అందాలతో రచ్చ చేసిందిలే!

ఇకపోతే ఈ రోజే డైరెక్టర్ పూరి జగన్నాథ్ పుట్టినరోజు కూడా కావడంతో ఆయనకు స్పెషల్ విషెస్ చెప్పారు రామ్ చరణ్. ''చిరుత షూటింగ్ చేసినప్పటి ప్రతిరోజు ఓ తీయని జ్ఞాపకం. ఇప్పటికీ ఆ రోజులను నిన్న లాగే భావిస్తుంటా. `చిరుత` యూనిట్ మొత్తానికి ధన్యవాదాలు. థాంక్ క్యూ పూరి గారు. హ్యాపీ బర్త్ డే'' అని అన్నారు చెర్రీ.

చిరుత వేసిన పునాదిపై ప్రత్యేక సామ్రాజ్యం నిర్మించుకున్న రామ్ చరణ్.. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో RRR మూవీ చేస్తున్నారు. మల్టీస్టారర్ సినిమాగా ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా ఈ మూవీ రూపొందుతోంది. ఎన్టీఆర్ కొమురం భీం రోల్ పోషిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గెటప్‌లో వెండితెర విందివ్వనున్నారు. వచ్చే ఏడాది జనవరి నెలలో ఈ సినిమాను రిలీజ్ చేయాలనేది జక్కన్న ప్లాన్.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.