యాప్నగరం

యూట్యూబ్‌లో 'ధృవ' సీన్

రామ్‌చ‌ర‌ణ్‌ తేజ్ లేటెస్ట్ మూవీ 'ధృవ' మరో రెండు రోజుల్లో విడుదల కాబోతుంది. అయితే ఈ లోపు ఈ సినిమాలోని ఓ ఆసక్తికర సీన్ యూట్యూబ్‌లో ప్రత్యక్షమైంది...

TNN 7 Dec 2016, 2:07 pm
మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌ తేజ్ లేటెస్ట్ మూవీ 'ధృవ' మరో రెండు రోజుల్లో విడుదల కాబోతుంది. అయితే ఈ లోపు ఈ సినిమాలోని ఓ ఆసక్తికర సీన్ యూట్యూబ్‌లో ప్రత్యక్షమైంది. ప్రమోషన్ కోసం చిత్ర యూనిట్ సభ్యులే ఈ సీన్ యూట్యూబ్‌లో విడుదల చేసినట్లుగా తెలుస్తోంది.
Samayam Telugu ram charans dhruva film scene leaked officially
యూట్యూబ్‌లో 'ధృవ' సీన్





రామ్‌చ‌ర‌ణ్‌, ర‌కుల్‌ప్రీత్ సింగ్ హీరోహీరోయిన్లుగా, సీనియర్ నటుడు అరవింద్ స్వామి విలన్ పాత్రలో గీతాఆర్ట్స్ బ్యాన‌ర్‌‌పై, డైరెక్ట‌ర్ సురేంధర్ రెడ్డి `ధృవ` సినిమాను తెరకెక్కించారు. తమిళంలో సూపర్ హిట్ అయిన 'తని ఓరువన్' సినిమాకి రీమేక్‌‌గా వస్తున్న 'ధృవ'పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో హీరో నవదీప్ మరో ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు.

'ధృవ' సినిమాకి తమిళ మ్యూజిక్ డైరెక్టర్ హిప్‌హాప్ తమీజా సూపర్ హిట్ సంగీతాన్ని అందించారు. నవంబర్ 9న ఈ సినిమా పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. డిసెంబర్ 9వ తేదీన 'ధృవ' ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.