యాప్నగరం

రామ్‌చ‌ర‌ణ్‌ 'ధృవ' పాటలు వచ్చేశాయ్ !

నవంబర్ 9న 'ధృవ' ఆడియోను విడుదల చేస్తామని ముందుగా ప్రకటించినట్లుగానే హిప్‌హాప్ తమీజా సంగీతం అందించిన ఈ సినిమా ఆడియోని బుధవారం విడుదల చేశారు. మొత్తం నాలుగు పాటలు ఉన్నాయి...

TNN 9 Nov 2016, 5:13 pm
నవంబర్ 9న 'ధృవ' ఆడియోను విడుదల చేస్తామని ముందుగా ప్రకటించినట్లుగానే నేడు ఈ సినిమా ఆడియోని విడుదల చేశారు. మొత్తం నాలుగు పాటలు ఉన్నాయి. ఈ సినిమాకి తమిళ మ్యూజిక్ డైరెక్టర్ హిప్‌హాప్ తమీజా సంగీతం అందించారు.
Samayam Telugu ram charans dhruva movie audio out now
రామ్‌చ‌ర‌ణ్‌ 'ధృవ' పాటలు వచ్చేశాయ్ !





మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌ తేజ్, ర‌కుల్‌ప్రీత్ సింగ్ జంట‌గా గీతాఆర్ట్స్ బ్యాన‌ర్‌‌లో, డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో `ధృవ` సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో సీనియర్ నటుడు అరవింద్ స్వామి విలన్ పాత్రలో నటిస్తున్నారు. తమిళంలో సూపర్ హిట్ అయిన 'తని ఓరువన్' సినిమాకి రీమేక్‌‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

ఎలాంటి వేడుక జరపకుండానే 'ధృవ' పాటలను మార్కెట్లో విడుదల చేశారు. డిసెంబర్ తొలి వారంలో 'ధృవ' సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారు. విడుదలకు ముందు రెండు ప్రీరిలీజ్ ఈవెంట్ లను విజయవాడలో మరియు వరంగల్‌‌లో ప్లాన్ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.