యాప్నగరం

‘కరోనా వైరస్’ని రంగంలోకి దించిన ఆర్జీవీ.. రిలీజ్ అప్పుడేనట

రామ్‌గోపాల్ వర్మ నిర్మించిన కరోనా వైరస్ సినిమాను త్వరలోనే విడుదల చేయనున్నట్లు గురువారం ప్రకటించారు. థియేటర్ల తెరుచుకున్నాక రిలీజయ్యే తొలి సినిమా తమదేనని వెల్లడించారు.

Samayam Telugu 1 Oct 2020, 11:30 am
లాక్‌డౌన్ కారణంగా ఆరు నెలలుగా మూతపడిన సినిమా థియేటర్లు తెరుచుకునే సమయం ఆసన్నమైంది. అన్‌లాక్ 5.0లో భాగంగా అక్టోబర్ 15 తర్వాత థియేటర్లు, మల్టీప్లెక్స్‌లు తెరుచుకునేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో పలువురు నిర్మాతలు తమ సినిమాలను విడుదల చేసేందుకు సన్నాహాలు మొదలుపెట్టారు. ఈ కోవలోనే సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ లాక్‌డౌన్ తర్వాత విడుదలయ్యే తొలి సినిమా తనదేనని ప్రకటించారు.
Samayam Telugu coronavirus poster


Also Read: సౌత్ హీరోల్లో టాప్ లేపిన విజయ్... ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్

లాక్‌డౌన్ సమయంలో ఏటీటీల ద్వారా పలు సినిమాలను విడుదల చేసిన వర్మ ప్రస్తుతం `కరోనా వైరస్` పేరుతో ఓ సినిమాను నిర్మిస్తున్నాడు. దీనికి అగస్త్య మంజు దర్శకత్వం వహించారు. అక్టోబర్ 15 నుంచి థియేటర్లు తెరుచుకోవడానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో `కరోనా వైరస్`ను వర్మ విడుదలకు సిద్ధం చేస్తున్నాడు. ఈ మేరకు గురువారం ఆయన ట్వీట్ చేశారు.

Also Read: పాన్ ఇండియా మూవీగా ‘సైనైడ్’ ... కీలక పాత్రలో ప్రియమణి

`మొత్తానికి అక్టోబర్ 15 నుంచి థియేటర్లు తెరుచుకుంటున్నాయి. లాక్‌డౌన్ తర్వాత విడుదలవుతున్న తొలి సినిమాగా `కరోనా వైరస్` నిలుస్తుందని ప్రకటిస్తున్నందుకు సంతోషంగా ఉంది` అంటూ రామ్‌గోపాల్ వర్మ ట్వీట్‌లో పేర్కొన్నారు.
Also Read: కీర్తిసురేష్ సినిమాపై వివాదం... నట్టికుమార్ కొడుకు, కుమార్తెపై కేసు నమోదు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.