యాప్నగరం

అల్లు అరవింద్‌ వ్యాఖ్యలపై స్పందించిన వర్మ

శ్రీరెడ్డి ఎపిసోడ్‌పై... తనపై నిర్మాత అల్లు అరవింద్ చేసిన వ్యాఖ్యలపై రామ్‌గోపాల్ వర్మ స్పందించారు. సోషల్ మీడియా పోస్ట్‌తో ఆయన చేసిన ప్రతి కామెంట్‌కు సమాధానం చెప్పారు.

Samayam Telugu 19 Apr 2018, 10:27 pm
శ్రీరెడ్డి ఎపిసోడ్‌పై... తనపై నిర్మాత అల్లు అరవింద్ చేసిన వ్యాఖ్యలపై రామ్‌గోపాల్ వర్మ స్పందించారు. సోషల్ మీడియా పోస్ట్‌తో ఆయన చేసిన ప్రతి కామెంట్‌కు సమాధానం చెప్పారు. పవన్ కళ్యాణ్ విషయంలో వేగంగా స్పందించిన అల్లు అరవింద్... శ్రీరెడ్డి విషయంలో నెల రోజులుగా చిన్న కామెంట్ కూడా ఎందుకు చేయలేదని ప్రశ్నించాడు. ఇండస్ట్రీలో తల్లి పాలు తాగి రొమ్ము గుద్దిన ఘనత వర్మదన్న అరవింద్ కామెంట్స్‌పై గట్టిగా స్పందించారు. ఇండస్ట్రీ మీరా... పవన్ కళ్యాణా... మీరు నాకు బ్రేక్ ఇచ్చారా... తల్లి పాలేంటి... తాను పవన్‌ను అని తన రొమ్మును తానే గుద్దుకున్నాననే కాని... తాను ఇంకెవరి రొమ్ము గుద్దలేదన్నారు.
Samayam Telugu Varma Allu Aravind


దగ్గుబాటి సురేశ్‌తో మాట్లాడి అభిరామ్‌ విషయంలో డబ్బులు ఇప్పించడానికి ప్రయత్నిస్తానని చెప్పానని... తాను ఇప్పిస్తానన్న రూ.5 కోట్లతో పవన్‌కు ఎలాంటి సంబంధం లేదన్నారు వర్మ. పవన్‌ ఆకాశమంత ఎత్తు ఉన్న సూపర్‌స్టార్‌, లీడర్‌. ఆయన స్థాయి తగ్గించడానికి నేనెవరని? ఎంతటివాడిని? నూటికి నూరు శాతం నేను చేసింది క్షమించరాని తప్పే. అరవింద్‌కు, పవన్‌కు, ఫ్యాన్స్‌కు, ఆయన కుటుంబ సభ్యులకు క్షమాపణలు చెబుతున్నా. మళ్లీ ఎప్పుడూ పవన్‌ మీద, అరవింద్‌ కుటుంబ సభ్యుల మీద నెగిటివ్‌ కామెంట్స్‌ పెట్టనన్నారు వర్మ.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.