యాప్నగరం

పవన్ నిద్రపోతున్న అగ్నిపర్వతం: వర్మ

''పవన్ కల్యాణ్ నా దృష్టిలో నిద్రపోతున్న అగ్ని పర్వతం.. సమయం వచ్చినప్పుడు ఒక విస్ఫోటంలా పేల్చుతుంది''. ఈ మాటలు ఎవరో అనలేదు సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నోటి నుండి వచ్చిన మాటలు.

TNN 22 Dec 2016, 7:29 pm
''పవన్ కల్యాణ్ నా దృష్టిలో నిద్రపోతున్న అగ్ని పర్వతం.. సమయం వచ్చినప్పుడు ఒక విస్ఫోటంలా పేల్చుతుంది''. ఈ మాటలు ఎవరో అనలేదు సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నోటి నుండి వచ్చిన మాటలు. ఈ మధ్య మెగాఫ్యామిలీ హీరోలపై ట్వీట్స్ చేస్తోన్న వర్మను దాని గురించి ప్రశ్నించగా.. ''నేను చిరంజీవి గారికి పెద్ద అభిమానిని, ఆయన చాలా కాలం తరువాత చేస్తోన్న సినిమా గనుక ఖచ్చితంగా అది బాహుబలి కంటే పెద్దగా ఉండాలని అభిమానిగా నేను కోరుకున్నాను అందులో తప్పేం లేదని'' అన్నారు.
Samayam Telugu ram gopal varma sensational comments on pawan kalyan
పవన్ నిద్రపోతున్న అగ్నిపర్వతం: వర్మ


అలానే పవన్ కల్యాణ్ అంటే తనకు చాలా ఇష్టమని అతడొక నిద్రపోతున్న అగ్నిపర్వతమని అన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులన్నిటినీ పవన్ అధ్యయనం చేస్తున్నాడు. ఎన్నికల్లో అతడు ఖచ్చితంగా నెగ్గుతాడని వర్మ చెప్పుకొచ్చాడు.

చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌‌‌లపై బయోపిక్ చేసే ఆలోచన ఉందా? అని ప్రశ్నించగా ''అందరితో మంచిగా ఉండే వారి బయోపిక్ తీయలేను.. బయోపిక్ చేయాలంటే ఖచ్చితంగా అందులో కాంట్రవర్సీ ఉండాల్సిందే'' అన్నారు. ప్రస్తుతం విజయవాడ గొడవల నేపధ్యంలో ఆయన తెరకెక్కించిన వంగవీటి సినిమా శుక్రవారం విడుదలకు సిద్ధంగా ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.