యాప్నగరం

ఫీల్‌ గుడ్ మూవీ.. ‘ఉన్నది ఒకటే జిందగీ’

రామ్ సినిమా అంటే మినిమమ్ గ్యారంటీ ఉంటుంది. కిందటేడాది ‘నేను శైలజ’ అనే క్లాస్ మూవీతో విజయాన్ని అందుకున్న రామ్.. ‘హైపర్’తో కాస్త నిరాశపరిచాడు. కొంచెం గ్యాప్ తరవాత ‘ఉన్నది ఒకటే జిందగీ’ అంటూ వస్తున్నాడు.

TNN 27 Oct 2017, 11:31 am
రామ్ సినిమా అంటే మినిమమ్ గ్యారంటీ ఉంటుంది. కిందటేడాది ‘నేను శైలజ’ అనే క్లాస్ మూవీతో విజయాన్ని అందుకున్న రామ్.. ‘హైపర్’తో కాస్త నిరాశపరిచాడు. కొంచెం గ్యాప్ తరవాత ‘ఉన్నది ఒకటే జిందగీ’ అంటూ వస్తున్నాడు. రామ్, అనుపమా పరమేశ్వర్, లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఉన్నది ఒకటే జిందగీ’. ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమాలో రామ్ డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తుండటంతో అందరి దృష్టి దీనిపై పడింది. దీనికి తోడు రామ్‌కు ‘నేను శైలజ’ లాంటి హిట్‌ను అందించిన కిశోర్ తిరుమల ‘ఉన్నది ఒకటే జిందగీ’కి దర్శకత్వం వహించడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.
Samayam Telugu ram pothineni vunnadhi okate zindagi telugu movie highlights
ఫీల్‌ గుడ్ మూవీ.. ‘ఉన్నది ఒకటే జిందగీ’


ఇక సినిమా కథ విషయానికి వస్తే.. ఇది స్నేహం, కొంతమంది స్నేహితులు చుట్టూ తిరిగే కథ. మధ్యలో ప్రేమకథ జత అవుతుంది. ఒక విధంగా చెప్పాలంటే.. బాల్యం, కాలేజ్ లైఫ్, ఆ తర్వాత పరిణతి సాధించాక వచ్చే జీవితం. ఇలా మూడు దశల నేపథ్యంలో కథ సాగుతుంది. లైఫ్ అంటే చాలా ఈజీ.. కానీ మనమే దాన్ని కాంప్లికేట్ చేసుకుంటున్నాం అనే ఆలోచనతో హీరో పాత్ర ఉంటుందట. అయితే సినిమాలో కమర్షియల్ వాల్యూస్ కాస్త తక్కువగానే ఉంటాయని, మాస్ ఆడియన్స్ ఈ సినిమా పెద్దగా నచ్చకపోవచ్చని టాక్. ఇదొక మంచి ఫీల్‌గుడ్ మూవీ అని.. అలాంటి సినిమాలు ఇష్టపడేవారికి కచ్చితంగా నచ్చుతుందని అంటున్నారు. ఇక దేవీశ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాకు మరో ప్లస్.

Also Read: ఎలా ఉంది.. ‘ఉన్నది ఒకటే జిందగీ’ ఆడియన్స్ టాక్

‘ఉన్నది ఒకటే జిందగీ’ సినిమాకు మరో మెయిన్ ఎట్రాక్షన్ హీరోయిన్స్. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్, లావణ్య త్రిపాఠి హీరోయిన్లు‌గా నటించారు. ఇద్దరూ చాలా నేచురల్‌గా నటించి సినిమాకు ప్లస్ అయ్యారని యూనిట్‌లో ప్రతి ఒక్కరు చెబుతున్న మాట. వీళ్ల పాత్రలు ప్రేక్షకుల్లో గుండెల్లో నిలిచిపోతాయని అంటున్నారు. ఈ సినిమాకు తొలి హీరో కథే అని.. దర్శకుడు భావోద్వేగాలను అద్భుతంగా చూపించాడని టాక్. మంచి ప్రొడక్షన్స్ వాల్యూస్, మనసుకు హత్తుకునే డైలాగ్స్, రామ్ పర్ఫార్మెన్స్, కామెడీ, భావోద్వేగాలు ఇవన్నీ సినిమాలో ఉన్నాయట. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేర అలరించిందో తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.