యాప్నగరం

మూతబడుతున్న రామానాయుడు స్టూడియో.. కారణాలు ఇవే!

నానక్‌రామ్ గూడలో ఉన్న రామానాయుడు స్టూడియోస్ హైదరాబాద్‌లోని ప్రముఖ ప్రదేశాల్లో ఒకటి. దిగ్గజ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు నెలకొల్పిన ఈ స్టూడియో గురించి తెలియనివారుండరు. 35 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న ఈ స్టూడియో ఇప్పుడు మూతబడుతోంది. ఈ విషయాన్ని రామానాయుడు స్టూడియోస్ యజమాని, ప్రముఖ నిర్మాత డి.సురేష్ బాబు అధికారికంగా ప్రకటించకపోయినా ఇదే నిజమని ఇండస్ట్రీ నుంచి బలంగా వినిపిస్తోన్న వార్త.

Samayam Telugu 18 Feb 2020, 7:04 pm
నానక్‌రామ్ గూడలో ఉన్న రామానాయుడు స్టూడియోస్ హైదరాబాద్‌లోని ప్రముఖ ప్రదేశాల్లో ఒకటి. దిగ్గజ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు నెలకొల్పిన ఈ స్టూడియో గురించి తెలియనివారుండరు. 35 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న ఈ స్టూడియో ఇప్పుడు మూతబడుతోంది. ఈ విషయాన్ని రామానాయుడు స్టూడియోస్ యజమాని, ప్రముఖ నిర్మాత డి.సురేష్ బాబు అధికారికంగా ప్రకటించకపోయినా ఇదే నిజమని ఇండస్ట్రీ నుంచి బలంగా వినిపిస్తోన్న వార్త.
Samayam Telugu ramanaidu studios to be shut down here are the reasons
మూతబడుతున్న రామానాయుడు స్టూడియో.. కారణాలు ఇవే!


అసలు కారణమేంటి?

సురేష్ బాబు ఈ నిర్ణయం తీసుకోవడానికి చాలా కారణాలే ఉన్నాయని తెలుస్తోంది. ముఖ్యంగా విశాఖపట్నంలోని స్టూడియోను మరింత విస్తరించాలనే ఉద్దేశంతో హైదరాబాద్‌లో స్టూడియోను మూసివేయాలని నిర్ణయించారట. ఏపీ ప్రభుత్వం కొత్త రాజధానికిగా విశాఖను ప్రకటించింది కాబట్టి అక్కడి స్టూడియో మీద సురేష్ బాబు దృష్టి పెట్టారని అంటున్నారు.

Also Read: వర్థమాన గాయనికి వరకట్న వేధింపులు.. ఫ్యాన్‌కు ఉరేసుకుని బలవన్మరణం

రూ. 400 కోట్ల ప్రాపర్టీ

ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న రామానాయుడు స్టూడియో విలువ సుమారు రూ.400 కోట్లు. కానీ, ఈ స్టూడియో నుంచి ఏడాదికి వచ్చే ఆదాయం రూ.2 కోట్లు మాత్రమే. ఈ స్టూడియోలో సినిమా షూటింగ్‌లు పెద్దగా జరగకపోవడం వల్లే ఆదాయం దారుణంగా పడిపోయిందట. కాబట్టి, ఇంత విలువైన ప్రాపర్టీ ద్వారా ఆదాయాన్ని భారీ మొత్తంలో రాబట్టే ప్లాన్‌ను సురేష్ బాబు వేశారట.

Also Read: రష్మికకు ముద్దుపెట్టి పరారయ్యాడా.. ఇదిగో అసలు నిజం

చుట్టూ అపార్ట్‌మెంట్లే..

ఒకప్పుడు రామానాయుడు స్టూడియో బయట నుంచి స్పష్టంగా కనిపించేది. కానీ, ఇప్పుడు స్టూడియో చుట్టూ బోలెడన్ని రెసిడెన్షియల్ అపార్ట్‌మెంట్లు వచ్చేశాయి. దీంతో అక్కడికి చేరుకోవడానికి చాలా కష్టమైపోతోంది. వర్షకాలం అయితే నరకమే. దీనికితోడు లోపల షూటింగ్ జరుగుతుంటే చుట్టూ ఉన్న అపార్ట్‌మెంట్లలో నుంచి జనం చూస్తున్నారు. తన ఫోన్లలో రికార్డు చేసేస్తున్నారు. దీంతో మేకర్స్‌కు ప్రైవసీ లేకుండా పోతోంది. దీంతో రామానాయుడు స్టూడియోకు వచ్చే సినిమాల సంఖ్య బాగా తగ్గిపోతోంది.

Also Read: అమ్మకు ప్రేమతో.. సురేఖకు చరణ్ బర్త్‌డే విషెస్

గేటెడ్ కమ్యూనిటీ కాలనీగా స్టూడియో..

ఈ విలువైన స్టూడియోను పడగొట్టి గేటెడ్ కమ్యూనిటీ ఉండే హౌసింగ్ కాలనీగా సురేష్ బాబు మార్చబోతున్నారట. ఖరీదైన అపార్ట్‌మెంట్లు కట్టి ఫ్లాట్లు అమ్మబోతున్నారట. దీని ద్వారా వచ్చే డబ్బుతో విశాఖపట్నంలోని స్టూడియోను అభివృద్ధి చేయనున్నారట. ఈ పనంతా చకచకా జరిగిపోతుందని అంటున్నారు. సురేష్ బాబు తీయబోయే మైథలాజికల్ మూవీని విశాఖపట్నం స్టూడియోలోనే ప్లాన్ చేస్తున్నారట.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.