యాప్నగరం

నెలకు రూ.2.50 లక్షల భరణం కావాలి : రంభ

'తన వైవాహిక జీవితంలో ఏ ఇబ్బందులూ లేవని, అంతా సాఫీగానే సాగిపోతోంది' అని సినీనటి రంభ చెప్పుకుంటున్నప్పటికీ...

TNN 27 Oct 2016, 4:23 pm
'తన వైవాహిక జీవితంలో ఏ ఇబ్బందులూ లేవని, అంతా సాఫీగానే సాగిపోతోంది' అని సినీనటి రంభ చెప్పుకుంటున్నప్పటికీ... ఆమె పర్సనల్ లైఫ్ మ్యాటర్స్ మాత్రం వార్తల్లో రావడం ఆగడంలేదు. భర్త నుంచి విడాకులు కావాలని రంభ ఫ్యామిలీ కోర్టుని ఆశ్రయించినట్టుగా మొన్న మంగళవారంనాడు వార్తలొచ్చాయి. కానీ అటువంటిదేమీ లేదు అని కొట్టిపారేసిందామె. కానీ తాజాగా వస్తున్న అప్‌డేట్స్ ప్రకారం బుధవారం రంభ మరోసారి భర్త నుంచి భరణం కోసం అదే కోర్టుమెట్లెక్కినట్టు తెలుస్తోంది. హిందూ మ్యారేజ్ యాక్టు ప్రకారం భర్త ఇంద్ర కుమార్ నుంచి తన రోజువారీ అవసరాల కోసం నెలకి రూ.2.50 లక్షలు భరణంగా ఇప్పించాల్సిందిగా ఆమె కోర్టులో మెయింటెనెన్స్ పిటిషన్ దాఖలు చేశారు. 'తన అవసరాలకు నెలకి రూ.1.5 లక్షలు కాగా ఇద్దరు కూతుళ్లకి తలా ఓ రూ.50,000 కావాలి' అని ఆమె ఆ పిటీషన్‌లో పేర్కొన్నారు.
Samayam Telugu rambha wants rs 2 5 lakh monthly as maintenence from her husband indra kumar
నెలకు రూ.2.50 లక్షల భరణం కావాలి : రంభ


వివాహానికి ముందు తాను సినిమాల్లో నటించేదానిని అని కానీ పెళ్లి తర్వాత సినిమాలు మానేయడంతో ఇప్పుడు కుటుంబపోషణకి అవసరమైన ఆదాయ వనరులు ఏమీ లేవు అని రంభ తన పిటిషన్‌లో ప్రస్తావించారు. రంభ పెద్ద కూతురు లాన్య ఓ ప్రైవేటు స్కూల్లో చదువుతుండగా ఆమె స్కూలు వార్షిక ఫీజు రూ. 3.5 లక్షలు. ఏడాదిన్నర వయసున్న చిన్న కూతురు సశ ఆరోగ్య అవసరాల నిమిత్తం డబ్బులు అవసరం అని రంభ కోర్టుకు తెలిపింది. అందుకే మొత్తంగా తనకు నెలకి రూ.2.5 లక్షలు భరణంగా చెల్లించేలా తన భర్తకు ఆదేశాలు ఇవ్వాల్సిందిగా కోర్టుని వేడుకున్నారామె. రంభ భర్త ఇంద్రకుమార్ కెనడాలో ఓ పారిశ్రామికవేత్త అనే సంగతి తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.