యాప్నగరం

రామ్‌చరణ్ తర్వాతి 3 చిత్రాలు ఇవేనా ?

మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ ప్రస్తుతం తన సొంత నిర్మాణంలో రూపొందిన ఖైదీ నెంబర్ 150 మూవీ రిలీజ్ కార్యక్రమాల్లో...

Samayam Telugu 10 Jan 2017, 7:00 pm
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ ప్రస్తుతం తన సొంత నిర్మాణంలో రూపొందిన ఖైదీ నెంబర్ 150 మూవీ రిలీజ్ కార్యక్రమాల్లో బిజీగా వున్నాడు. ఈ సినిమా విడుదలకి ఇంకా ఒక్క రోజే మిగిలివుంది. 9 ఏళ్ల తర్వాత తండ్రి హీరోగా రీ ఎంట్రీ ఇస్తోన్న సినిమా కావడంతో ఎలాగైనా ఈ చిత్రాన్ని బ్లాక్‌బస్టర్ చేసుకోవాలని భావిస్తున్న చెర్రీ దానికి అనుగుణంగా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇక ఈ 'ఖైదీ నెంబర్ 150' సంగతలా పక్కనపెడితే, ఈ యువ నిర్మాత హీరోగా నటించనున్న తర్వాతి మూడు సినిమాల గురించి తాజాగా ఓ ప్రచారం ఊపందుకుంది.
Samayam Telugu ramcharans next three films after dhruva
రామ్‌చరణ్ తర్వాతి 3 చిత్రాలు ఇవేనా ?


ఇప్పటికే సుకుమార్ డైరెక్షన్‌లో ఓ సినిమా సైన్ చేశాడు చెర్రీ. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ సినిమా పూర్తయిన వెంటనే కొరటాల శివ దర్శకత్వంలో ఇంకో సినిమా ఉండనుంది. అటు కొరటాల కూడా ఆలోగా మహేష్ బాబుతో తన సినిమాను పూర్తి చేసుకునేలా ప్లాన్ చేసుకుంటున్నాడట. సుకుమార్, కొరటాల దర్శకత్వంలో రెండు సినిమాలు పూర్తయిన వెంటనే మణిరత్నంలో సినిమా చేయాలని భావిస్తున్నాడట చరణ్.

గతంలోనే మణిరత్నంతో కలిసి ఓకే బంగారం సినిమాలో చెర్రీ నటిస్తాడు అని అప్పట్లో ఓ టాక్ నడిచింది. కానీ అంతిమంగా వివిధ కారణాలతో ఆ కాంబినేషన్ ఇప్పటివరకు కుదరలేదు. ఈసారి ఈ రెండు చిత్రాల ఫలితాలనిబట్టి మళ్లీ మణిరత్నంతో సినిమా ఉంటుందా లేదా అనేది తెలిసిపోతుంది అని సమాచారం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.