యాప్నగరం

సిక్స్ ప్యాక్ హీరోని 'గే' అని కామెంట్ చేసిన వర్మ

అమితాబ్ బచ్చన్ నుంచి సాధారణ ఆర్టిస్ట్ వరకు ఎవరినీ వదలకుండా వారిపై తనకున్న అభిప్రాయాన్ని...

TNN 3 Mar 2017, 6:34 pm
అమితాబ్ బచ్చన్ నుంచి సాధారణ ఆర్టిస్ట్ వరకు ఎవరినీ వదలకుండా వారిపై తనకున్న అభిప్రాయాన్ని, వారి గురించి తనకి తోచించి తోచినట్టు చెప్పేయడంలో రాంగోపాల్ వర్మ ఎప్పుడూ ఓ అడుగు ముందే వుంటాడు. తాజాగా వర్మ కంట్లో పడిన నటుడు ఎవరో కాదు... బాలీవుడ్ యాక్టర్ జాకీష్రాఫ్ తనయుడు టైగర్ ష్రాఫ్. నిన్న బర్త్‌డే జరుపుకున్న టైగర్ ష్రాఫ్‌ని తన ట్వీట్స్‌తో ఓ విధంగా బాగా డిజప్పాయింట్ చేశాడు వర్మ. శారీరకంగా ఫిట్‌నెస్ కలిగి వున్న హీరోల్లో టైగర్ ష్రాఫ్ కూడా ఒకరు.
Samayam Telugu ramgopal varmas gay tweets on tiger shroff
సిక్స్ ప్యాక్ హీరోని 'గే' అని కామెంట్ చేసిన వర్మ



అయితే, టైగర్ ష్రాఫ్ తరచుగా షర్ట్‌లెస్ ఫోటోలతో ఫోజులివ్వడంపై వర్మ తనదైన స్టైల్లో కామెంట్ చేశాడు. " సిసలైన మగాళ్లు ఇలా షర్ట్‌లెస్‌గా ఫోజులివ్వరని, కేవలం గేలు మాత్రమే ఇలా ఫోజిస్తారు" అని కామెంట్ చేస్తూ రకరకాల ట్వీట్లు చేశాడు వర్మ. 'తన వ్యాఖ్యలు నమ్మశక్యంకాకపోతే నాలాగే బ్రూస్ లీకి వీరాభిమాని అయిన మీ డ్యాడీని అడుగు చెబుతాడు' అంటూ పదేపదే టైగర్ ష్రాఫ్‌ని టార్గెట్ చేశాడు వర్మ.


విచిత్రం ఏంటంటే, జాకీష్రాఫ్ ప్రస్తుతం వర్మతో కలిసి సర్కార్-3 సినిమాకి పనిచేస్తున్నాడు. ఈ సినిమాలో విలన్ రోల్ ప్లే చేస్తోంది జాకీష్రాఫే. తనతో కలిసి పనిచేస్తున్న ఆర్టిస్ట్ తనయుడిని వర్మ టార్గెట్ చేసిన తీరు ఇండస్ట్రీవర్గాలని షాక్‌కి గురిచేసింది.
Hey @bindasbhidu all my tweets on @iTIGERSHROFF are purely as ur fan and not otherwise ..please tell this to @AyeshaShroff and him pic.twitter.com/9a53ogH4b9— Ram Gopal Varma (@RGVzoomin) March 2, 2017
అయితే, చివర్లో జాకీష్రాఫ్‌ని ఉద్దేశించి కూడా ఓ ట్వీట్ చేసిన వర్మ... "టైగర్ ష్రాఫ్‌పై చేసిన వ్యాఖ్యలన్నీ మీ అభిమానిగా చేసినవేనని.. లేదంటే అలా చేసేవాడిని కాదు" అని అందులో పేర్కొనడం కొసమెరుపు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.