యాప్నగరం

‘రాములో రాముల’ ఫుల్ వీడియో సాంగ్.. దోసె స్టెప్ షురూ చేయండిక!

‘అల వైకుంఠపురములో’ సినిమాలోని మంచి మాస్ సాంగ్ ‘రాములో రాముల’ ఫుల్ వీడియో విడుదలైంది. తమన్ స్వరపరిచిన ఈ పాట ఎంత పాపులర్ అయ్యిందో తెలిసిందే.

Samayam Telugu 3 Mar 2020, 7:50 pm
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ చిత్రం నాన్ బాహుబలి రికార్డులన్నింటినీ కొల్లగొట్టింది. ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లపై అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ సంయుక్తంగా నిర్మించారు. తమన్ సంగీతం అందించారు.
Samayam Telugu Ramuloo Ramulaa Song
‘రాములో రాముల’ ఫుల్ వీడియో సాంగ్


కాగా, ఈ సినిమా ఎంత పెద్ద హిట్టయ్యిందో అంతకన్నా ఎక్కువ ఆల్బమ్ పాపులర్ అయ్యింది. ఈ సినిమాకు తమన్ అందించిన ఆల్బమ్ ప్రేక్షకుల్లోకి బాగా వెళ్లిపోయింది. ముఖ్యంగా ‘సామజవరగమన’, ‘బుట్టబొమ్మ’, ‘రాములో రాముల’ పాటలు జనాల నోటిలో బాగా నానాయి. ‘సామజవరగమన’ పాట అయితే సాంగ్ ఆఫ్ ది ఇయర్‌గా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక ‘రాములో రాముల’ పాట అయితే తెలంగాణ యాసలో సాగుతూ ఆల్బమ్‌లో మంచి మాస్ సాంగ్‌గా నిలిచింది. ఈ పాటలో దోసె స్టెప్ బాగా పాపులర్ అయ్యింది.

Also Read: రాధిక నా తల్లి కాదు.. వాళ్లు మొరిగే కుక్కలు: వరలక్ష్మీ శరత్‌కుమార్

ఇప్పటికే ‘సామజవరగమన’, ‘బుట్టబొమ్మ’ ఫుల్ వీడియో సాంగ్స్‌ని విడుదల చేశారు. తాజాగా ‘రాములో రాముల’ వీడియో సాంగ్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్‌లో దూసుకుపోతోంది. కాసర్ల శ్యామ్ రచించిన ఈ పాటను అనురాగ్ కులకర్ణి, మంగ్లి పాడారు. ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో సాంగ్ చూస్తూ మీరూ దోసె స్టెప్ షురూ చేయండిక!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.