యాప్నగరం

Prabhas: రానా పెళ్లైతే.. ప్రభాస్‌కి మోగుతున్న బాజాలు, ఇంకెన్నాళ్లిలా చెప్పరా అంటూ..

రానాకి పెళ్లి అవుతుంటే.. వీళ్ల ఫోకస్ మొత్తం ప్రభాస్‌పై పెట్టారు. భయ్యా!! మీ మిత్రుడు రానా కూడా పప్పన్నం పెట్టేస్తున్నాడు.. మరి మీరెప్పుడు అంటూ ఓ రేంజ్‌లో మీమ్స్ వదలుతున్నారు.

Samayam Telugu 13 May 2020, 11:43 am
మొత్తానికి భల్లాలదేవుడు ఒక ఇంటి వాడు అవుతున్నాడు. ఇన్నాళ్లు గుట్టు చప్పుడుగా ఉంచిన తన దేవసేనను పరిచయం చేస్తూ.. నా దేవసేన నాకు ఓకే చెప్పేసిందహో అంటూ అదిరిపోయే రొమాంటిక్ పిక్ వదిలారు. దీంతో టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కాస్త కొత్త పెళ్లికొడుకుగా మారిపోయాడు. మెగాస్టార్ చిరంజీవితో సహా టాలీవుడ్ మొత్తం శతమానం భవతి అంటూ ఆశీర్వాదం అందించేయడంతో రానా పెళ్లి వార్త సోషల్ మీడియాలో వైర్ అవుతోంది. ఇంతకీ రానా పెళ్లాడబోయే ఆ దేవసేన ఎవరంటే హైదరాబాద్‌కి చెందిన ప్రముఖ డిజైనర్ మిహికా బజాజ్‌. అంతా బాగానే ఉంది కాని.. భల్లాలదేవుడి సంగతి సరే మరి బాహుబలి పరిస్థితి ఏంటి? సినిమాలో అయితే భల్లాలదేవుడ్ని కాదని.. దేవసేనతో సెట్ అయిపోయాడు. మరి రియల్ లైఫ్‌లో బాహుబలి పెళ్లి ఎప్పుడు అంటూ సోషల్ మీడియాలో రకరకాల మీమ్స్ హల్ చల్ చేస్తున్నాయి.
Samayam Telugu రానా, ప్రభాస్ (Rana And Prabhas)
Rana And Prabhas


‘రానాకి పెళ్లై పోతుంది.. ప్రభాస్ అన్నా పప్పన్నం ఎప్పుడు పెడుతున్నావ్? లాక్ డౌన్‌లో రానా తన ప్రేయసితో లాక్ అయ్యాడు.. మరి మీరెప్పుడు?’ అంటూ ప్రభాస్ పెళ్లి కోసం ఎదురుచూసే అభిమానులు రకరకాల ప్రశ్నలు వేస్తుంటే.. మరికొంత మంది ఫన్నీ మీమ్స్ క్రియేట్ చేసి వదులుతున్నారు. ప్రభాస్-రానా పెళ్లి గురించి మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటున్నట్టుగా ఉన్న మీమ్స్ పొట్ట చెక్కలు చేస్తున్నాయి. ‘ఈ సడెన్ సర్ ప్రైజ్ ఏంట్రా మాకు అని రానాని ప్రభాస్ అడుగుతుండటం.. ఇంకా ఎన్ని రోజులురా ఇట్టాగా.. నువ్ కూడా జల్దీ చేస్కో’ అని రానా.. ప్రభాస్‌కి చెప్తున్నట్టుగా ఉన్న మీమ్ నవ్వులు పుట్టిస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.