యాప్నగరం

హాలీవుడ్ సినిమా తెలుగు వెర్షన్‌కి రానా దగ్గుబాటి డబ్బింగ్

బాహుబలి-2 సినిమాలో భళ్లాలదేవగా మరింత పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్న రానా దగ్గుబాటి తాజాగా ఓ హాలీవుడ్ సినిమా...

TNN 6 Oct 2016, 12:54 pm
బాహుబలి-2 సినిమాలో భళ్లాలదేవగా మరింత పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్న రానా దగ్గుబాటి తాజాగా ఓ హాలీవుడ్ సినిమా తెలుగు వెర్షన్‌కి డబ్బింగ్ చెప్పాడు. డాన్ బ్రౌన్ రాసిన నవల ఆధారంగా రాన్ హావర్డ్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఇన్‌ఫర్నో అనే హాలీవుడ్ సినిమాలో హాలీవుడ్ స్టార్ టామ్ హ్యాంక్స్ హీరోగా నటించాడు. టామ్ హ్యాంక్స్ రాబర్ట్ ల్యాంగ్‌డన్ పాత్రలో నటించిన ఈ సినిమాని హాలీవుడ్ కన్నా 2 వారాల ముందుగా ఇండియన్ మార్కెట్‌లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు ఆ మూవీ మేకర్స్. ఇండియాలోనూ లార్జెస్ట్ మార్కెట్ అయిన తెలుగు ఆడియెన్స్ కోసం తెలుగులోనూ ఈ సినిమా రిలీజ్ కానుంది. అందులో భాగంగానే తెలుగు వెర్షన్‌లో టామ్ హ్యాంక్స్‌కి అవసరమైన తెలుగు డబ్బింగ్ రానా దగ్గుబాటి చెప్పాడు. మూడు రాత్రులపాటు కష్టపడి ఈ డబ్బింగ్ పూర్తి చేసినట్టు సమాచారం.
Samayam Telugu rana daggubatis dubbing for telugu version of a hollywood movie inferno
హాలీవుడ్ సినిమా తెలుగు వెర్షన్‌కి రానా దగ్గుబాటి డబ్బింగ్


Take extreme pride in lending my voice to one of the greatest actors on this planet @tomhanks for the #InfernoMovie pic.twitter.com/5Suucr4FFe— Rana Daggubati (@RanaDaggubati) October 5, 2016
#BhallalaDeva in the day and #RobertLangdon by night !! #Bestjobintheworld pic.twitter.com/ezD2rKLulR— Rana Daggubati (@RanaDaggubati) October 5, 2016
ఈ డబ్బింగ్ గురించి ట్విటర్ వేదికగా తన అభిప్రాయాన్ని వెల్లడించిన రానా... టామ్ హ్యాంక్స్ లాంటి గొప్పనటుడికి తన వాయిస్ అందించే అవకాశం రావడం పట్ల ఎంతో ఆనందం వ్యక్తంచేశాడు. పగలు బాహుబలి-2 షూటింగ్‌లో భళ్లాలదేవగా, రాత్రి ఇన్‌ఫర్నో మూవీ డబ్బింగ్‌లో రాబర్ట్ ల్యాంగ్‌డన్ పాత్ర పోషిస్తున్నానని మరో ట్వీట్ చేసిన రానా... ఈ రెండు పనులని ప్రపంచంలోనే ఉత్తమమైనవిగా పోల్చాడు. ఈమధ్య కాలంలో హాలీవుడ్ సినిమాలకి డబ్బింగ్ చెప్పడం సైతం ఓ క్రేజ్ అయిపోయిందని... ఇటువంటి అవకాశాలు మరిన్ని వచ్చినా అవి స్వీకరించడానికి నేను సిద్ధంగా వున్నాను అంటున్నాడు రానా దగ్గుబాటి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.