యాప్నగరం

రానా తర్వాతి సినిమాలో హాలీవుడ్ హీరోయిన్!

బాహుబలి సినిమాతో నేషనల్ వైడ్‌గా స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న రానా దగ్గుబాటి తాజాగా ఓ హాలీవుడ్ స్థాయి...

TNN 29 Jul 2017, 4:11 pm
బాహుబలి సినిమాతో నేషనల్ వైడ్‌గా స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న రానా దగ్గుబాటి తాజాగా ఓ హాలీవుడ్ స్థాయి సినిమాకి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. హాలీవుడ్‌కి చెందిన లండన్ డిజిటల్ మూవీ అనే ఓ ప్రొడక్షన్ హౌజ్‌తో రానా ఓ అగ్రిమెంట్ కుదుర్చుకున్నట్టు సమాచారం. ఈ విషయాన్ని స్వయంగా రానానే ట్విటర్ ద్వారా తన అభిమానులకి తెలిపాడు. సినిమా నిర్మాణ రంగంలోకి కొత్త టెక్నాలజీని పరిచయం చేయదల్చుకున్నట్టు రానా తన ట్విటర్ పోస్ట్‌లో పేర్కొన్నాడు.
Samayam Telugu rana daggubatis next to have a hollywood actress
రానా తర్వాతి సినిమాలో హాలీవుడ్ హీరోయిన్!

Happy to be associated with LDM !! Looking fwd to making some great cinema and brining in better technology in filmmaking!! https://t.co/8WHaF6ZKFl— Rana Daggubati (@RanaDaggubati) July 29, 2017
బాలీవుడ్ స్టార్ రానా దగ్గుబాటితో ఓ సినిమాకు సైన్ చేసినట్టు సదరు లండన్ డిజిటల్ మూవీ హౌజ్ చేసిన ట్వీట్‌కి స్పందిస్తూ రానా ఈ ట్వీట్ చేశాడు. 2018లో ప్రారంభం కానున్న ఈ సినిమాలో రానా సరసన ఓ ప్రముఖ హాలీవుడ్ హీరోయిన్ జంటగా నటించనుందని సమాచారం.

ఇక రానా ప్రస్తుత ప్రాజెక్ట్స్ విషయానికొస్తే, అతడు నటించిన నేనే రాజు నేనే మంత్రి సినిమా ఇంకొద్ది రోజుల్లోనే ఆడియెన్స్ ముందుకొచ్చేందుకు రెడీ అవుతోంది. తేజ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో రానా సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.