యాప్నగరం

చిన్న పిల్ల అడుక్కుంటున్నా పట్టించుకోని రష్మిక.. నెటిజన్ల ట్రోలింగ్

రష్మిక మందన తాజాగా ముంబైకి వెళ్లింది. అక్కడ ఓ హోటల్ నుంచి అలా బయటకు వచ్చినట్టుంది. అలా ఆమె బయటకు రాగానే ఓ చిన్నారి పాప వచ్చి అడుక్కోవడం ప్రారంభించింది.

Samayam Telugu 25 Jan 2022, 4:50 pm

ప్రధానాంశాలు:

  • ముంబైలో రష్మిక మందన జోరు
  • అడుక్కుంటూ కనిపించిన చిన్న పాప
  • పర్సులోంచి రూపాయి తీయని రష్మికపై నెటిజన్లు ఫైర్
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu చిన్న పిల్ల అడుక్కుంటున్నా పట్టించుకోని రష్మిక
Rashmika Mandanna
నేషనల్ క్రష్‌గా రష్మిక మందకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు రష్మిక కేవలం సౌత్ స్టార్ మాత్రమే కాదు. పాన్ ఇండియన్ స్టార్‌గా రష్మిక మారింది. పుష్ప సినిమా కంటే ముందుగానే రష్మిక హిందీలో రెండు మూడు ప్రాజెక్ట్‌లు ఓకే చేసింది. కరోనా లేకపోయి ఉంటే ఈ పాటికే రష్మిక బాలీవుడ్ డెబ్యూ జరిగిపోయేది. పుష్ప హిందీ డబ్బింగ్‌తో రష్మికకు మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. రష్మిక నటనకు ఇక్కడి విమర్శకులు పెదవి విరిచారు. ఓవర్ యాక్షన్ అంటూ ట్రోల్స్ కూడా వచ్చాయి.
కానీ నార్త్ ప్రేక్షకులు మాత్రం రష్మిక మందనపై ప్రశంసలు కురిపించారు. మొత్తానికి రష్మికకు పుష్ప సినిమాతో మంచి ఫాలోయింగ్ పెరిగింది. అయితే ఈ ఫాలోయింగ్‌ను కాపాడుకోవడమే అతి పెద్ద సమస్యగా మారుతుంది. ఎక్కడ ఎలా దొరికినా నెటిజన్లు ఉతికి ఆరేస్తుంటారు. అందంతో పాటు మంచి మనసుంటే మాత్రం నెటిజన్లు నెత్తిన పెట్టుకుంటారు.

ఆ విషయంలోనే రష్మిక ఫ్లాప్ అయింది. రష్మిక అందం గురించి అందరికీ తెలిసిందే. ఆమెకు అందం ఉంది కానీ అందమైన మనసు లేదంటూ జనాలు విరుచుకుపడుతున్నారు. దీనికి ఓ కారణం ఉంది. నిన్న రష్మిక మందన ముంబైకి వెళ్లింది. అక్కడ ఓ హోటల్ నుంచి అలా బయటకు వచ్చినట్టుంది. అలా ఆమె బయటకు రాగానే ఓ చిన్నారి పాప వచ్చి అడుక్కోవడం ప్రారంభించింది.

అలా పాప రావడంతోనే రష్మిక సెక్యూరిటీ గార్డులు పక్కకు జరిపారు. అయినా కూడా ఆ పాప రష్మికను ప్రాధేయ పడుతుంది. ఆకలేస్తుంది.. తినాలి.. ఏమైనా ఉంటే ఇవ్వండి.. డబ్బులు ఇవ్వండి అనే టేపులో పాప ప్రాధేయపడింది. కానీ రష్మిక మాత్రం నవ్వుతూనే వెళ్లిపోయింది. కారులో కూర్చుంది. కానీ ఒక్క రూపాయి కూడా తీసి ఇవ్వలేకపోయింది.
View this post on Instagram A post shared by F I L M Y G Y A N (@filmygyan)

ఈ విషయం మీద నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండి పడుతున్నారు. అదే స్థానంలో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఉంటే ఎలా ఉండేదో కదా? అని గుర్తు చేసుకున్నారు. ఆ పాప అలా అడుక్కుంటుంటే.. నువ్ ఎలా నవ్వగలుగుతున్నావ్ అని రష్మికను నెటిజన్లు ఏకిపారేశారు. మొత్తానికి ఈ వీడియో మాత్రం ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.