యాప్నగరం

చెర్రీ-తారక్ మల్టీస్టారర్‌లో విలన్‌గా రవితేజ?

రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో మల్టీస్టారర్ మూవీ. గత కొద్దిరోజులుగా టాలీవుడ్‌ సర్కిల్‌లో బాగా సర్క్యులేట్ అవుతున్న సినీ వార్త ఇది.

TNN 2 Feb 2018, 12:51 pm
రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో మల్టీస్టారర్ మూవీ. గత కొద్దిరోజులుగా టాలీవుడ్‌ సర్కిల్‌లో బాగా సర్క్యులేట్ అవుతున్న సినీ వార్త ఇది. ఏ ముహూర్తాన రాజమౌళి ట్విట్టర్‌లో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేశాడో అప్పటి నుండీ ఈ మూవీపై రోజుకో వార్త పుట్టకొస్తుంది. మొత్తానికి అనేక ఊహాగానాల నేపథ్యంలోనే చెర్రీ-తారక్ మూవీ వచ్చే ఏడాది సెట్స్‌పైకి వెళ్లడం దాదాపు ఖాయమైనట్లే.
Samayam Telugu ravi teja interesting tweet on ram charan jr ntr multistarrer movie
చెర్రీ-తారక్ మల్టీస్టారర్‌లో విలన్‌గా రవితేజ?


ఇక పోతే ఈ మల్టీస్టారర్ మూవీకి సంబంధించి ఇప్పటికే అనేక రూమర్లు పుట్టుకొచ్చేశాయి. ఇందులో ఎన్టీఆర్-రామ్ చరణ్‌లు అన్నదమ్ములుగా నటిస్తున్నారని.. ఇది బాక్సింగ్ నేపథ్యంలో సాగే కథ అని.. ఇందులో ఎన్టీఆర్ నెగిటివ్ రోల్‌లో నటిస్తున్నారంటూ చాలానే గాసిప్స్ నడిచాయి. అయితే తాజాగా ఈ సినిమాలో రవితేజ విలన్‌గా నటిస్తున్నాడంటూ మరో వార్త హల్ చల్ చేస్తుంది. అంతేకాదు ఇదే విషయాన్ని డైరెక్ట్‌గా రవితేజనే అడిగేశాడు ఓ అభిమాని దీంతో మాస్ రాజా తనదైన శైలి మాస్ మసాలా పంచ్ విసిరాడు.

రవితేజ, రాశీఖన్నా, సీరత్ కపూర్ హీరోయిన్లుగా విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ మసాలా ఎంటర్ టైనర్ ‘టచ్ చేసి చూడు’ శుక్రవారం నాడు(ఈరోజు) థియేటర్స్ రావడంతో ప్రమోషన్స్‌లో భాగంగా ట్విట్టర్‌లో అభిమానులతో లైవ్ ఛాట్‌లో పాల్గొన్నాడు రవితేజ. ఈ సందర్భంగా ఎన్టీఆర్, రామ్ చరణ్ మూవీలో మీరు విలన్‌గా నటిస్తున్నారా అన్న ప్రశ్నకు సమాధానంగా.. ‘ఊహించుకోవడాలు వద్దు.. కాని అలా జరిగితే మంచి పరిణామమే’ అన్నారు మాస్ రాజా.

దీనితో పాటు పలు ఆసక్తికరమైన ప్రశ్నలకు ఫన్నీ ఆన్సర్స్ ఇచ్చాడు రవితేజ.. వాటిలో కొన్ని

Dont get into assumptions...but good try 😄 https://t.co/rCpkgWoSo1 — Ravi Teja (@RaviTeja_offl) February 1, 2018
ఫ్యాన్స్: రామ్ గోపాల్, వర్మ త్రివిక్రమ్ మూవీలో చూడాలని ఉంది.
రవితేజ: ఇద్దరితో కలిసి ఒకే సినిమా చేయలేం కదా చూద్దాం.

ఫ్యాన్స్: హీరోయిన్స్ ఎవర్నైనా ప్రేమించారా?
రవితేజ: అబ్బా.. ఛా!!

ఫ్యాన్స్: మీ ఫస్ట్ క్రష్
రవితేజ: హా చెప్పేస్తారు మరి!!

ఫ్యాన్స్: అమితాబ్‌తో మూవీ ఎప్పుడు?
రవితేజ: నేను దానికే వెయిట్ చేస్తున్నా.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.