వాల్తేరు వీరయ్య (waltair veerayya) మూవీలో మాస్ మహరాజా రవితేజ (Ravi Teja) క్యారెక్టర్ చాలా కీలకమని ఫస్ట్ నుంచి ఆ చిత్ర యూనిట్ చెప్తూ వచ్చింది. ఇటీవల జరిగిన ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్లోనూ ఆ క్యారెక్టర్ గురించి మాట్లాడిన మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi).. రవితేజ ఎంట్రీతో సినిమా మరో లెవల్‌కి వెళ్లిపోతుందని కూడా చెప్పుకొచ్చారు. చిరంజీవి చెప్పినట్లే.. మూవీలో రవితేజ ఎంట్రీతో అసలైన ఊపు మొదలవుతుంది. పోలీస్ ఆఫీసర్ పాత్రలో చక్కగా ఒదిగిపోయిన రవితేజ.. డైలాగ్ డెలివరీలోనూ తన మార్క్ చూపించాడు. చిరంజీవి, రవితేజ పోటీపడి నటించారు. డ్రగ్స్ మాఫియా బ్యాక్‌డ్రాప్‌తో వచ్చిన ఈ సినిమాలో చిరంజీవి, రవితేజ మధ్య కొన్ని సీన్స్ అభిమానుల్ని అలరిస్తాయి. అలానే ఇద్దరి మధ్య వచ్చే సెంటిమెంట్ సీన్స్ మనసుకి హత్తుకునేలా ఉన్నాయి. మూవీలో అన్నదమ్ములుగా కనిపించిన చిరంజీవి, రవితేజ.. అందరి ముందు ఆధిపత్య ధోరణిలో తిట్టుకుంటూ కనిపించినా.. లోలోపల ఒకరిపై మరొకరు ప్రేమని చూపించుకునే సీన్స్ ప్రేక్షకుల్ని కట్టిపడేశాయి.
రెండు దశాబ్దాల క్రితం వచ్చిన ‘అన్నయ్య’ మూవీలో చిరంజీవి, రవితేజ అన్నదమ్ములుగా కలిసి నటించారు. ఆ తర్వాత కూడా చాలా సందర్భాల్లో చిరంజీవిపై సోదర భావాన్ని రవితేజ వ్యక్తీకరిస్తూ కనిపించాడు. మరోవైపు చిరంజీవి కూడా రవితేజపై అదే ప్రేమని కనబరుస్తూ వచ్చారు. దాంతో స్క్రీన్‌పై కూడా ఈ అన్నదమ్ముల బంధం బాగా పండింది. దాంతో ప్రేక్షకులు కూడా చాలా సులువుగా కనెక్ట్ అయిపోతారు. ఇద్దరి మధ్య ఓ ప్రామిస్ ట్విస్ట్‌ని క్లైమాక్స్ వరకూ తీసుకెళ్లడంలో దర్శకుడు బాబీ సక్సెస్ అయ్యారు.
గత వారం జరిగిన వాల్తేరు వీరయ్య ప్రీరిలీజ్ ఈవెంట్లో రవితేజ క్యారెక్టర్ గురించి మెగాస్టార్ చిరంజీవి ఏం చెప్పారంటే? ‘‘రవితేజ సెకండాఫ్‌లో వస్తాడు.. దుమ్ము దులిపేస్తాడు. రవితేజ క్యారెక్టర్ ఎంట్రీ తర్వాత సినిమా మరో లెవల్‌కి వెళ్లిపోతుంది. ఒకవేళ ఆ క్యారెక్టర్ రవితేజ చేయకపోతే న్యాయం జరిగేది కాదు’’ అని చెప్పుకొచ్చారు. సినిమా చూసిన తర్వాత చాలా మంది ప్రేక్షకులు రవితేజ క్యారెక్టర్లో మరే హీరోని కూడా ఊహించుకోలేమని చెప్తుండటం విశేషం.
Read Latest Telugu Movies News , Telugu News