యాప్నగరం

‘రాజా ది గ్రేట్’ డబుకు డిబుకు డప్పు అదుర్స్

రాజా.. రాజా.. రాజా ది గ్రేటురా!! నువ్ తళ తళ టు థౌజండ్ నోటురా అంటూ మాస్ మహరాజ రవితేజ డబుకు డిబుకు డప్పేసుకుంటూ ‘ రాజా ది గ్రేట్’ టైటిల్ సాంగ్‌తో వచ్చేశాడు.

TNN 18 Sep 2017, 6:45 pm
రాజా.. రాజా.. రాజా ది గ్రేటురా!! నువ్ తళ తళ టు థౌజండ్ నోటురా అంటూ మాస్ మహరాజ రవితేజ డబుకు డిబుకు డప్పేసుకుంటూ ‘ రాజా ది గ్రేట్’ టైటిల్ సాంగ్‌తో వచ్చేశాడు. శ్రీ వెంకటశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో దిల్ రాజు నిర్మాతగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రాజా ది గ్రేట్’ మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా టైటిల్ సాంగ్‌ లిరిక్స్‌ని ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదల చేశారు చిత్రయూనిట్.
Samayam Telugu raviteja raja the great title song with lyrics
‘రాజా ది గ్రేట్’ డబుకు డిబుకు డప్పు అదుర్స్


ఈ లిరిక్ వీడియోలో హీరో రవితేజతో పాటు చిత్ర యూనిట్ మొత్తం సందడి చేస్తూ ఆకట్టుకుంటున్నారు. రాజా ది గ్రేట్ అంటూ సాగిన ఈ పాటకు యువ మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తీక్ అదిరిపోయే మాస్ బీట్ అందించారు. ‘డబుకు డిబుకు డబుకు డిబుకు డప్పులే... అదిరిపోద్ది నేనేసే స్టెప్పులే’ అంటూ శ్యాం కసర్ల రాసిన లైన్ మాస్ రాజాకు కరెక్ట్‌గా యాప్ట్ అయ్యింది. ఈ సాంగ్‌లో రవితేజ కూడా గొంతు కలపడం విశేషం. అంతే కాదు ఈ సాంగ్ మధ్యలో రవితేజ వాయిస్ ఓవర్ సాంగ్‌కు మరింత ఊపుతెచ్చింది. ఈసాంగ్‌ను రవితేజతో పాటు రేవంత్, సాకేత్‌లు కలిసి పాడారు. మరి మాస్ మహరాజా ‘డబుకు డిబుకు డప్పులే’ సాంగ్‌పై ఓ లుక్కేద్దామా!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.