యాప్నగరం

రవితేజ డ్రైవర్ పోలీసులకి అన్నీ చెప్పేశాడా ?

తెలుగు సినీ పరిశ్రమలో సంచలనం రేపిన డ్రగ్స్‌ రాకెట్ కేసులో సినీ హీరో రవితేజ డ్రైవర్‌ శ్రీనివాసరావు విచారణ....

TNN 29 Jul 2017, 4:46 pm
తెలుగు సినీ పరిశ్రమలో సంచలనం రేపిన డ్రగ్స్‌ రాకెట్ కేసులో సినీ హీరో రవితేజ డ్రైవర్‌ శ్రీనివాసరావు విచారణ ముగిసింది. శుక్రవారం రవితేజని 9 గంటలపాటు ప్రశ్నించిన పోలీసులు శనివారం అతడి డ్రైవర్ శ్రీనివాస రావుని నాలుగు గంటల పాటు విచారించారు. యధావిధిగానే నాంపల్లిలోని ఎక్సైజ్‌ కార్యాలయంలో ఉదయం 10.30 గంటలకు ప్రారంభమైన ఈ విచారణ మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో ముగిసింది. రవితేజకి డ్రైవర్ కావడంతో రవితేజ ప్రతీ కదలిక శ్రీనివాస రావుకి తెలిసే వుంటుందనే కోణంలోనే పోలీసులు ఈ విచారణ జరిపినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా డ్రగ్స్ సరఫరాలో కీలక నిందితులుగా వున్న కెల్విన్, జీషాన్‌లతో రవితేజకు వున్న సంబంధాలపై సైతం సిట్ బృందం శ్రీనివాస రావుని ఆరా తీసినట్టు సమాచారం.
Samayam Telugu ravitejas driver srinivasa raos investigation finished in drugs case
రవితేజ డ్రైవర్ పోలీసులకి అన్నీ చెప్పేశాడా ?


ఇదిలావుంటే, ఈ డ్రగ్స్ రాకెట్ కేసు విచారణలో భాగంగా సోమవారం యువ నటుడు తనీష్‌, మంగళవారం గీతా మాధురి భర్త నందూను సిట్‌ అధికారులు ప్రశ్నించనున్నారు. దీంతో తొలి విడత జాబితా ముగియనున్నప్పటికీ... ఈసారి సినీ ప్రముఖులలో పెద్దవారిగా చలామణి అవుతున్న వారి పేర్లతో కూడిన మరో జాబితా సిట్ వద్ద సిద్ధంగా వున్నట్టు టాక్.

గత కొన్ని దశాబ్ధాలుగా సినీ పరిశ్రమలో సినీ ప్రముఖుడిగా కొనసాగుతున్న ఓ సెలబ్రిటీకి వచ్చే వారం నోటీసులు జారీ చేయనున్నట్టు వారం రోజుల క్రితమే సిట్ నుంచి సంకేతాలు అందినట్టు మీడియాలో పలు వార్తలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో ఎప్పుడు, ఎటువంటి వార్త వినాల్సి వస్తుందా అనే భయం ఇంకొంతమంది సినీ ప్రముఖులని వేధిస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.