యాప్నగరం

టీవీ ఆర్టిస్ట్ ప్రదీప్ ఆత్మహత్యపై ఇన్‌స్పెక్టర్ వెర్షన్

నటుడు ప్రదీప్ కుమార్ ఆత్మహత్య మరోసారి బుల్లితెర వర్గాల్లో కలకలంరేపింది. ఇప్పుడిప్పుడే కెరీర్‌లో రానిస్తున్న...

Hindustan Times 4 May 2017, 1:16 pm
నటుడు ప్రదీప్ కుమార్ ఆత్మహత్య మరోసారి బుల్లితెర వర్గాల్లో కలకలంరేపింది. ఇప్పుడిప్పుడే కెరీర్‌లో రానిస్తున్న తరుణంలో కొత్తగా పెళ్లయిన ప్రదీప్ ఆత్మహత్యకు పాల్పడటం వెనుక అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రదీప్ ఆత్మహత్యపై భిన్నమైన కథనాలు వినిపిస్తున్నాయి. మంగళవారం అర్థరాత్రి దాటాకా ఇంట్లో సీలింగ్ ఫ్యాన్‌కి ఉరి వేసుకుని కనిపించిన ప్రదీప్‌ని చూసిన అతడి భార్య, మరో స్నేహితుడు ఇద్దరూ కలిసి ప్రదీప్‌ని ఆస్పత్రికి తరలించారని, కానీ అప్పటికే అతడు మృతిచెందినట్టుగా వైద్యులు నిర్ధారించారని నార్సింగి పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ పీ రాంచందర్ రావు తెలిపారు.
Samayam Telugu reasons behind tv actor pradeep kumars suicide
టీవీ ఆర్టిస్ట్ ప్రదీప్ ఆత్మహత్యపై ఇన్‌స్పెక్టర్ వెర్షన్


'ప్రదీప్ ఆత్మహత్యకి గల కారణాలు ఏంటనేది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. అంతకన్నా ముందు రాత్రి ప్రదీప్, అతడి భార్య మధ్య ఘర్షణ జరిగినట్టు సమాచారం వుంది. ప్రదీప్ మృతదేహంపై కూడా ఎటువంటి గాయాలు లేవు. పోస్టుమార్టం తర్వాతే పూర్తి వివరాలు తెలుస్తాయి. సీఆర్పీసీ సెక్షన్ 174 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం' అని వివరించారు ఇన్‌స్పెక్టర్.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.