యాప్నగరం

మై నేమ్ ఈజ్ ‘జమునా రాణి’ అంటున్న రెజీనా

తాజాగా రెజీనా క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘నక్షత్రం’ అనే పోలీస్ థ్రిల్లర్‍లో ఓ డిఫరెంట్ రోల్‌లో కనిపించి ప్రేక్షకులను కనువిందుచేయనుంది.

TNN 17 Oct 2016, 3:34 pm
టాలీవుడ్‌ తన అందచందాలతో, అభినయంతో వరుసగా సినిమాలు చేస్తున్న హీరోయిన్ రెజీనా. స్టార్ హీరోయిన్ ల లిస్ట్ లో చేరడానికి రెజీనా చేయని ప్రయత్నం లేదు. తాజాగా రెజీనా క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘నక్షత్రం’ అనే పోలీస్ థ్రిల్లర్‍లో ఓ డిఫరెంట్ రోల్‌లో కనిపించి ప్రేక్షకులను కనువిందుచేయనుంది. కృష్ణవంశీ సినిమాలో హీరోయిన్ అంద చందాలకు కొదువే ఉండదు. హీరోయిన్‌ని అందంగా చూపించడంలో తన క్రియేటివిటీని చూపిస్తాడు ఈ క్రియేటివ్ డైరెక్టర్. నక్షత్రం సినిమాలో రెజీనా ‘జమునా రాణి’ అనే జూనియర్ ఆర్టిస్ట్ పాత్రలో కనిపిస్తూ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. మెగాహీరో రాంచరణ్ విడదల చేసిన ఈ ఫస్ట్‌లుక్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ‘రారా కృష్ణయ్య’లో లిప్‌లాక్‌తో ప్రేక్షకులను కనువిందు చేసిన సందీప్ కిషన్, రెజీనా జంట ‘నక్షత్ర’మూవీ లో మరోసారి జతకట్టారు. సుప్రీమ్ హీరో ‘సాయిధరమ్‌తేజ’ కూడా ఈ సినిమాలో నటించడం ఈ సినిమా పై భారీ అంచనాలే ఉంటాయి. నవంబర్ నెలలో నక్షత్ర మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రమోషన్ ‌లో భాగంగా రెజీనా టీజర్‌ని రిలీజ్ చేశారు.
Samayam Telugu regina cassandra first look from nakshatram movie
మై నేమ్ ఈజ్ ‘జమునా రాణి’ అంటున్న రెజీనా

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.