యాప్నగరం

రెండున్నర కోట్ల వ్యవహారం.. కాజల్‌కు ఊరట!

ఒక కొబ్బరినూనె ఉత్పత్తి, మార్కెటింగ్ సంస్థపై నటీమణి కాజల్ అగర్వాల్ వేసిన పిటిషన్ ఆసక్తికరమైన మలుపు తిరిగింది.

TNN 12 Oct 2017, 9:44 am
ఒక కొబ్బరినూనె ఉత్పత్తి, మార్కెటింగ్ సంస్థపై నటీమణి కాజల్ అగర్వాల్ వేసిన పిటిషన్ ఆసక్తికరమైన మలుపు తిరిగింది. ఆ సంస్థ తనకు రెండున్నర కోట్ల రూపాయల నష్టపరిహారాన్ని చెల్లించాలని డిమాండ్ చేస్తూ కాజల్ మద్రాస్ హై కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ నేపథ్యంలో వ్యవహారం కాజల్ కు అనుకూలంగా మారింది. దిగువ కోర్టు ఇచ్చిన తీర్పుపై హై కోర్టు స్టే విధించింది. ఇది కాజల్ కు అనుకూలమైన పరిణామమే.
Samayam Telugu releaf for kajal in court case
రెండున్నర కోట్ల వ్యవహారం.. కాజల్‌కు ఊరట!


ఈ వ్యవహారం కథాకమామీషు ఏమిటంటే.. కొన్నేళ్ల కిందట కాజల్ కొబ్బరినూనె అమ్మకం కంపెనీ ఒకదాని కోసం యాడ్ లో నటించింది. ఒక ఏడాదికి గానూ ఒప్పందం చేసుకుని ఆ సంస్థ కాజల్ తో యాడ్ ను రూపొందించిందట. అయితే.. ఏడాది గడిచిపోయినా.. కాజల్ నటించిన ఆ యాడ్‌ను సదరు సంస్థ అలాగే ప్రసారం చేసింది. దీనిపై కాజల్ చెన్నై సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తనతో ఒప్పందాన్ని ఉల్లంఘించి ఆ సంస్థ యాడ్ ను ప్రసారం చేసిందని, ఇందుకు గానూ తనకు రెండున్నర కోట్ల రూపాయలు పరిహారం చెల్లించాలని కాజల్ తన పిటిషన్ లో పేర్కొంది.

అయితే దిగువ కోర్టు కాజల్ విన్నపాన్ని తోసిపుచ్చింది. ఆ సంస్థకు యాడ్‌పై అరవై సంవత్సరాల వరకూ హక్కులు ఉంటాయని పేర్కొంది. అక్కడ ఎదురుదెబ్బ తగిలినా కాజల్ అగర్వాల్ హై కోర్టులో పిటిషన్ వేసింది. ఆ సంస్థ తను నటించిన యాడ్ ను వాడుకున్నందుకు పరిహారాన్ని చెల్లించాల్సిందే అని హై కోర్టులో పిటిషన్ వేసింది కాజల్. ఈ నేపథ్యంలో కౌంటర్ దాఖలు చేయాలని హై కోర్టు కొబ్బరినూనె కంపెనీని ఆదేశించింది. ఆ సంస్థ న్యాయస్థానంలో ఎలాంటి పిటిషన్ దాఖలు చేయలేదు. దీంతో కింది కోర్టు ఇచ్చిన తీర్పుపై హై కోర్టు స్టే విధించింది. తదుపరి విచారణతో కాజల్ అనుకున్నంత పరిహారాన్ని పొందుతుందేమో చూడాలి!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.