యాప్నగరం

Chiranjeevi: షూటింగ్ మొదలే కాలేదు.. అప్పుడే రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌!

మెగాస్టార్‌ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా త్వరలో రెగ్యులర్‌ షూటింగ్‌కు వెళ్లనుంది. ఈ సినిమాను 2020 ఆగస్టు 14న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్‌.

Samayam Telugu 17 Dec 2019, 12:32 pm
రీ ఎంట్రీ తరువాత మెగాస్టా్ర్‌ స్టో అండ్‌ స్టడీ సూత్రాన్ని ఫాలో అవుతున్నాడు. ఖైదీ నంబర్‌ 150 సినిమాతో గ్రాండ్‌గా రీ ఎంట్రీ ఇచ్చాడు మెగాస్టార్‌ చిరంజీవి. తరువాత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చారిత్రక చిత్రం సైరా నరసింహారెడ్డి సినిమాతో ఆకట్టుకున్నాడు. ఈ సినిమా ఘన విజయం సాధించకపోయినా మంచి వసూళ్లనే రాబట్టింది.
Samayam Telugu Chiru Koratala
చిరంజీవి - కొరటాల శివ


సైరా రిలీజ్‌ తరువాత గ్యాప్‌ తీసుకున్న మెగాస్టార్‌ త్వరలో తన నెక్ట్స్ సినిమాను ప్రారంభించేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. త్వరలో రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభించేందుకు రెడీ అవుతున్నారు చిత్రయూనిట్. ఈ సినిమాలో మెగాస్టార్‌కు జోడిగా చెన్నై బ్యూటీ త్రిష నటించనుంది.
Also Read: యూట్యూబ్‌ను షేక్‌ చేస్తున్న సూపర్‌ స్టార్‌.. రజనీ మేనియా మామూలుగా లేదు!

అయితే ఇంకా షూటింగ్ ప్రారంభం కాకపోయినా.. ఈ సినిమా రిలీజ్‌ డేట్‌పై చర్చ మొదలైంది. సందేశాత్మక కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాను స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఆగస్టు 14న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. భరత్‌ అనే నేను సినిమా తరువాత లాంగ్‌ గ్యాప్‌ తీసుకున్న దర్శకుడు కొరటాల శివ, మెగా ఇమేజ్‌కు తగ్గ కథను రెడీ చేశాడు.
See Photo Story: ఎవడ్రా ఆంటీ ఈ ఫిగర్ చూడు 36-24-36.. RGVకే నచ్చేసింది!


ఈ సినిమాలో చిరు యంగ్ లుక్‌లో కనిపించనున్నాడు. ఇప్పటికే కొత్త లుక్‌ కోసం కసరత్తులు ప్రారంభించిన మెగాస్టార్‌ జిమ్‌లో కష్టపడుతున్నాడు. అదే సమయంలో యంగ్‌ కనిపించేందుకు ప్రత్యేకంగా ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను మెగా పవర్‌ స్టార్‌ రామ్ చరణ్‌ కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్నాడు.
Also Read: బాహుబలి 2 రికార్డ్‌ను బ్రేక్‌ చేసిన విజయ్‌.. దళపతి ఖాతాలో మరో ఘనత!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.