యాప్నగరం

పవన్ ఫ్యాన్‌పై రేణూదేశాయ్ ఫైర్..!

పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణూదేశాయ్ కి ఆ హీరో అభిమానులకు మధ్య ట్విటర్లో వార్ కొనసాగుతూ ఉంది.

TNN 3 Mar 2018, 3:10 pm
పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణూదేశాయ్ కి ఆ హీరో అభిమానులకు మధ్య ట్విటర్లో వార్ కొనసాగుతూ ఉంది. ఆ మధ్య రేణూదేశాయ్ మళ్లీ పెళ్లి చేసుకునే ఆలోచన ఉన్నట్టుగా ప్రకటించిన సమయంలో.. కొంతమంది పవన్ కల్యాణ్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆమెపై మండిపడ్డారు. విడాకుల అనంతరం ఆమె పెళ్లి చేసుకోవడానికి వీలు లేదనే వాదనతో ఆమెను ఇబ్బంది పెట్టారు. దానిపై బహిరంగంగానే తన అసహనాన్ని చాటింది రేణూదేశాయ్. అదలా ఉంటే.. ఇటీవల రేణూదేశాయ్ పోస్టు చేసిన ఒక కవిత విషయంలో, పవన్ అభిమాని ఒకరు స్పందించిన తీరుపై రేణూ మండి పడింది.
Samayam Telugu renudesai fires on pk fan
పవన్ ఫ్యాన్‌పై రేణూదేశాయ్ ఫైర్..!


ఈ సంవాదం ఇలా ఉంది...‘మీ వల్ల పవన్ కల్యాణ్ రాజకీయ పార్టీలకు టార్గెట్ అవుతున్నారు. మీరు హాఫ్ నాలెడ్జ్ తో వస్తారు. మీరేదో చెబుతారు. మీడియా దాన్ని హైలెట్ చేస్తుంది. దయచేసి మీ పని మీరు చూసుకోండి, హ్యాపీగా ఉండండి.. అంతే కానీ పవన్ కల్యాణ్ సార్ గురించి దేన్నీ షేర్ చేయవద్దు..’ అని అంటూ పవన్ అభిమాని ఒకరు రేణూ దేశాయ్ కు ట్వీట్ చేశారు.

దీనిపై స్పందిస్తూ..‘నిజంగానా? నేను కవిత రాస్తే దాంతో పవన్ కల్యాణ్ ఎందుకు టార్గెట్ అవుతారు? అదెలా సాధ్యంఅవుతుంది? మీరు మీ పని చూసుకోండి. నేను సోషల్ మీడియాలో ఏదైనా పోస్టు చేసిన ప్రతిసారీ మీరు వచ్చి ఎందుకు నాతో అసభ్యంగా ప్రవర్తిస్తారు? నా ట్వీట్లపై మీరెందుకు రాద్ధాంతం చేస్తారు?’ అని అర్థం వచ్చేలా రేణూదేశాయ్ ట్వీట్ పెట్టింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.